‘ఆడది’.. తరచుగా అమ్మాయిలను లేదా ఆడవాళ్ళను చులకనగా మాట్లాడుకోవడానికి వయోబేఢం లేకుండా ప్రతి ఒక్క మగవాడు వినియోగించే పదం అది. అదే ‘ఆడది’ తలచుకొంటే తనను చులకనగా చూసే మగవాడికి చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పడం చాలా సులభం. కానీ.. తరతరాలుగా పేరుకుపోయిన ఆమెలోని భయమో లేక తనపైనా తనకు అభధ్రతా భావయో తెలియదు కానీ.. మగవారి ఆకృత్యాలను ఎంతో ఓర్పుతో భరిస్తుంటుంది. కానీ.. ‘సాధిక’ అలాంటిది కాదు. ఆమె కూడా చిన్నప్పట్నుంచి ఒక సగటు యువతి ఎదుర్కొనే అన్ని సమస్యలనూ రుచిచూసింది. ఆఖరికి ఆత్మ హత్య చేసుకొని మరణించాలన్న ష్టాయికి దిగజారిపోయింది. కాదు.. అలా దిగజారేలా చేశారు కొందరు “మృగాళ్ళు”. సరిగ్గా.. మరికొద్ది నిమిషాల్లో మరణించాలని నిశ్చయించుకొన్న ఆమెకు.. ఆమె మనసు సహకరించడం లేదు. అందుకు కారణం ఆమెను పెంచిన తల్లి నూరిపోసిన అభ్యుదయ భావాలు, ఆమెను కన్న తండ్రి మరణించి కూడా నూరిపోసిన మానసిక స్థైర్యం. ఈ రెండు ఆమెలోని ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనను తునాతునకలు చేయడమే కాదు.. సదరు సమస్యలను ఎదుర్కోవలంటే కావాల్సింది సహనమని నేర్పాయి. అప్పుడే “సాధిక” ఓ కొత్త జీవితాన్ని ఆరంభించింది.
ఈ “సాధిక” ఎవరు?
ఆమె ఎదుర్కొన్న సమస్యలేంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే “అమ్మకు ప్రేమతో సాధిక” అనే ఈ లఘు చిత్రాన్ని తప్పకుండా చూడండి. “సాధిక” పాత్రలో “ఉయ్యాల జంపాల” ఫేమ్ పునర్నవి భూపాలం జీవించిన తీరు చూసి ఎవరి కళ్లైనా సరే చెమర్చాల్సిందే!