లేడీ రోబోపై బాహుబలుడి పరాక్రమం!

  • June 3, 2016 / 06:15 AM IST

“బాహుబలి”తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు.. అసంఖ్యాక అభిమానులను సంపాదించుకొన్న మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం “బాహుబలి 2” షూటింగ్ మరియు “బాహుబలి” విదేశీ రిలీజ్ కోసం పబ్లిసిటీ పనుల్లో యమ బిజీగా ఉన్నాడు.

అయితే.. ప్రభాస్ ఓ సినిమా తీయాలని గత రెండేళ్లుగా కాచుకొని కూర్చున్న యువ దర్శకుడు సుజీత్ మాత్రం సినిమాకి సంబంధించిన నటీనటవర్గం మరియు సాంకేతికవర్గాన్ని ఒక్కొక్కటిగా సమకూర్చుకొంటున్నాడు.

తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో కథానాయికగా బికినీ బ్యూటీ అమీ జాక్సన్ ను ఎన్నుకొన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో “రోబో 2.0” సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు ప్రభాస్ సరసన సినిమా అనగానే “సై” అన్నదని, డేట్స్ కూడా ఇచ్చేసిందని చెప్పుకొంటున్నారు.
ఇంతకీ ఈ సినిమా సెట్స్ కు వెళుతుందనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus