కీరవాణి, రాజమౌళి అన్నదమ్ములే…అయినా ఇంటి పేర్లలలో మార్పు ఎందుకు?

  • July 10, 2020 / 12:05 PM IST

రాజమౌళి సినిమాలన్నికీ కీరవాణినే సంగీతం అందిస్తూ వస్తున్నారు. అసలు వేరే మ్యూజిక్ డైరెక్టర్ ను ఎందుకు తీసుకోరు అని రాజమౌళినే అడిగితే.. ‘నాకు అంత మ్యూజిక్ టేస్ట్ లేదు, నను అర్ధం చేసుకుని మా అన్నయ్య కీరవాణి గారు అయితేనే మంచి మ్యూజిక్ అందిస్తారు’ అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. సరే వాళ్లిద్దరూ అన్నదమ్ములు అయినప్పుడు.. ఇనీషియల్స్ లో ఎందుకు అంత మార్పు? రాజమౌళి పేరుకు ముందు SS అని ఉంటుంది… కీరవాణి పేరుకు ముందు MM అని ఉంటుంది.

రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ గారి పేరుకు ముందు KV అని ఉంటుంది. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులైతే .. అంత మార్పు ఎందుకు వచ్చింది అని చాలా మందికి డౌట్ గా ఉండి ఉంటుంది. డౌట్ అవసరం లేదు.. రాజమౌళి, కీరవాణి లు ఓకే ఫ్యామిలీకి చెందిన వ్యక్తులే. రాజమౌళి, కీరవాణి ల ఇంటి పేరు కోడూరి.మరో సంగీత దర్శకుడు కళ్యాణి కోడూరి అదే కళ్యాణి మాలిక్ కూడా వీరి సోదరుడే. రాజమౌళి పూర్తి పేరు శ్రీశైల శ్రీ రాజమౌళి. SS అక్షరాలకి అర్థం అదే.ఇక కీరవాణి పూర్తి పేరు మరకతమణి కీరవాణి.

ఆయన పేరు లో ఉండే MM అక్షరాలు రెప్రెజంట్ చేస్తాయన్న మాట. వారి కుటుంబంలో ఇంటిపేరును ఉపయోగించింది కళ్యాణ్ మాలిక్ ఒక్కరే. ఆయన పేరు కల్యాణి కోడూరి అని ఉంటుంది.ఇక ‘ప్రేమించు’ ‘అదిరిందయ్యా చంద్రం’ వంటి సినిమాలకు సంగీతం అందించిన ఎం.ఎం.శ్రీలేఖ కూడా వీరి సోదరే. మరి ఆమె పేరులో MM అని ఎందుకు ఉంది? అనే డౌట్ కూడా మీకు రావచ్చు.అయితే ఆమె పూర్తి పేరు మణిమేఖల శ్రీలేఖ. అందుకే ఆమె కూడా శ్రీలేఖ కు ముందు MM అని పెట్టుకున్నారు.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus