కొన్ని సినిమాలు క్రిటిక్స్ ను మాత్రమే మెప్పిస్తాయి.. ఎందుకో అవి కమర్షియల్ గా వర్కౌట్ అవ్వవు.’గులాబీ’ వంటి పాత్ బ్రేకింగ్ లవ్ స్టొరీ ని అందించి సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు కృష్ణ వంశీనా ‘నిన్నే పెళ్లాడతా’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాని అందించింది? నిజంగా ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలోలా రెండు కుటుంబాలు ఒకే చోట ఉంటూ… ప్రతీ పూటా కలిసి భోజనం చేస్తూ.. అల్లరి చేస్తూ ఉంటే… నిజంగా రోజూ పండగ లానే ఉంటుంది కదా.! అందుకే ఆ సినిమాకి ఫ్యామిలీస్ కార్లు వేసుకుని మరీ వెళ్ళి చూసారు. నిర్మాతకు పెట్టిన రూపాయికి పది రెట్లు లాభాల్ని తెచ్చిపెట్టింది. దర్శకుడు కృష్ణవంశీని స్టార్ డైరెక్టర్ ను చేసేసింది ఆ చిత్రం. అలాంటి దర్శకుడు ‘హ్యాపీగా ఓ కమర్షియల్ సినిమా చేసుకోవచ్చుగా… ఎందుకు తరువాత ‘సింధూరం’ అనే సినిమా చేశాడు’ ఇలాంటి డౌట్స్ రావడానికి కూడా ఎక్కువ సమయం పట్టలేదు.
ఎందుకో దర్శకుడు కృష్ణవంశీకి ఆ ఆరాటం. ఎప్పుడూ కమర్షియల్ పందాలో సినిమా చెయ్యాలి అని ఆలోచించడే..! అప్పటికి సైడ్ క్యారెక్టర్లు వేసుకునే బ్రహ్మాజీ, రవితేజ వంటి వాళ్ళను హీరోలుగా పెట్టి ‘సింధూరం’ చేశాడు. సినిమా పెద్దగా ఆడలేదు. ‘నిన్నే పెళ్ళాడతా’ సినిమాకి ఉన్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంతా.. ‘సింధూరం’ సినిమాకి వెళ్లి కృష్ణవంశీని తిట్టుకుని మధ్యలోనే వచ్చేసారు. సరే కమర్షియల్ గా వర్కౌట్ కానప్పటికీ ఈ సినిమా ఓ క్లాసిక్. ‘అసలు చాలా మంది జనాలు కుటుంబాన్ని వదిలేసి.. అడవిలో ఎందుకు పాట్లు పడతారు? రాజకీయ నాయకులంటే.. వాళ్ళకు ఎందుకు ఆ మంట?’.. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఈ చిత్రంలో సమాధానం దొరుకుతుంది. ఇందులో ప్రతీ మాట కూడా వాస్తవం..
అద్బుతం. ముఖ్యంగా రచయిత సీతారామ శాస్త్రిగారు ఈ చిత్రంలో పాటలకు ఇచ్చిన లిరిక్స్ కు .. ఆయన్ని ఎంత పొగిడినా తక్కువే.! ఇప్పటికీ ఈ చిత్రానికి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ‘మొగుడు’ ‘గోవిందుడు అందరి వాడేలే’ ‘నక్షత్రం’ వంటి సినిమాలు కృష్ణవంశీ ఏ పరధ్యానంలో ఉండి తీసారో తెలీదు కానీ.. ఆయన కాలానికి తగినట్టు.. కలానికి పదును పెడితే.. ‘సింధూరం’ వంటి కల్ట్ క్లాసిక్స్ ను ఎన్నో మనకు అందించగలరు. మీకు డౌట్ గా ఉంటే… ఓసారి ‘సింధూరం’ సినిమాని చూడండి. ఈ ప్రసంసలన్నీ తక్కువేనేమో అనిపిస్తుంది.
Most Recommended Video
పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?