టాలీవుడ్లో చాలా మంది మహామహుల బయోపిక్కులు రూపొందాయి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ బయోపిక్ రాబోతుంది. అదే ‘చే’. క్యూబా పోరాట యోధుడుగా చేగువేరా బయోపిక్ నే ‘చే’ టైటిల్ తో రూపొందించారు. కొంతమంది పుస్తకాల రూపంలో ఆయన గురించి తెలుసుకున్నారు. ఇంకొంతమంది పలు హాలీవుడ్ సినిమాల నుండి కొంతవరకు తెలుసుకుని ఉంటారు. అయితే టాలీవుడ్ ప్రేక్షకులకి అంతంత మాత్రమే తెలిసిన ఈ వ్యక్తి గురించి చాలా గొప్ప విషయాలు దాగున్నాయి అనేది అక్షర సత్యం.
అసలు ఈ చేగువేరా ఎవరు అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. ఇతను అర్జెంటీనాలో జన్మించాడు. పుట్టుకతోనే ఇతను ఆస్తమాతో బాధపడేవారట. దీంతో తనలా ఎవ్వరూ బాధపడకూడదు అనే ఉద్దేశంతో పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలని అనుకున్నాడు. తాను అనుకున్నట్టే మెడిసిన్ కంప్లీట్ చేశారు. అయితే ఇదే క్రమంలో కుష్టి రోగంతో బాధపడుతున్న వారికి ఉచితంగా మెడిసిన్స్ ఇవ్వాలనే సంకల్పంతో బైక్ పైనే కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించదు. ఈ టైంలో, అమెరికా ఆధిపత్యానికి బానిసలుగా బ్రతుకుతున్న క్యూబా పేద ప్రజలను చూసి చలించిపోయాడు.
దీంతో వాళ్ళ బానిసత్వానికి స్వస్తి చెప్పేందుకు అతను గన్నుపట్టి క్యూబా అనే దేశానికి ఇండిపెండెన్స్ తీసుకొచ్చాడు, ఈ క్రమంలో అతనికి పదవి ఇస్తామని అక్కడి ప్రభుత్వం ఆఫర్ ఇచ్చినా కాదన్నాడు. తర్వాత మళ్ళీ బొలివియా అనే దేశ ప్రజల కోసం కూడా గన్ను పట్టాడు. అక్కడి దేశానికి ఇండిపెండెన్స్ తీసుకురావడానికి అతను చివరి శ్వాస వరకు పోరాడాడు. ‘చే’ బియోపిక్లో ఇలాంటి సంఘటనలు చూపించబోతున్నారు.అవి హైలెట్ గా ఉండబోతున్నాయి అని తెలుస్తుంది.
‘నవ ఉదయం’ సమర్పణలో ‘నేచర్ ఆర్ట్స్ బ్యానర్’ పై ఎస్.సూర్య,ఎస్.బాబు, ఎస్.దేవేంద్ర ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. బీఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ, దర్శకత్వం వహించారు.లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమా మహేశ్వర్ కీలక పాత్రలు పోషించారు. రవిశంకర్ సంగీత దర్శకుడు. డిసెంబర్ 15 న ‘చే’ మూవీ (Che Longlive) ప్రేక్షకుల ముందుకు రానుంది.