మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన స్వయంకృషితో స్టార్ గా ఎదిగారు.ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే అల్లు వారి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది కదా అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే అల్లు రామలింగయ్య గారి ఫ్యామిలీలో చిరులా నటించే వారు అప్పట్లో లేరు అనేది విశ్లేషకుల జవాబు. పైగా ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్లో చిరు నటించిన సినిమాలు ప్లాప్ లు అయినవి కూడా ఉన్నాయి.
అయితే చిరంజీవి అంత పెద్ద స్టార్ అవ్వడానికి ఆయన తండ్రి కొణిదెల వెంకట్రావు గారు అని చిరు పలు సందర్భాల్లో చెప్పినా అవి హైలెట్ అవ్వలేదు. చిరుకి ఫస్ట్ క్రిటిక్ వెంకట్రావ్ గారేనట. చిరంజీవికి ఏ కథలు సూట్ అవుతాయి.. దర్శకనిర్మాతల పట్ల ఎలా వ్యవహరించాలి అనే విషయాలు చిరుకి రోజూ చెబుతూ ఉండేవారట వెంకట్రావ్ గారు. అంతేకాదు వెంకట్రావ్ గారు కూడా నటుడే. ఆయన చదువుకునే రోజుల్లో స్టేజి పై చాలా వేసే నాటకాల్లో కూడా నటించేవారట.
కానీ కుటుంబ పరిస్థితుల రీత్యా నటన పై ఫోకస్ పెట్టలేకపోయారు. అయితే ఆ ముచ్చటని కొడుకు సినిమాల ద్వారా తీర్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాపు గారి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంత్రి గారి వియ్యంకుడు’ సినిమాలో వెంకట్రావ్ గారు నటించారు. ఆ తర్వాత కూడా రెండు సినిమాల్లో నటించారు కానీ అవి విడుదలకు నోచుకోలేదు.
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!