బాలయ్య,వెంకీ,విజయశాంతి ల ఫోటో వెనుక ఉన్న కథ..!

ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలకు సంబంధించిన త్రో బ్యాక్ పిక్స్ వైరల్ అవుతుండడం మనం చూస్తూనే వస్తున్నాం. ఆ కోవలోనే ఇప్పుడు బాలకృష్ణ, వెంకటేష్, విజయశాంతి లకు సంబంధించిన ఓ ఫోటో తెగ వైరల్ అవుతుంది. వీళ్ళ వింటేజ్ లుక్స్ అదుర్స్ అంటూ అభిమానులు మురిసిపోతున్నారు. ఇంతకీ ఈ ఫోటో ఎప్పటిది? ఏ సందర్భం లోనిది? అనే విషయాలు తెలుసుకోవాలి అంటే మనం ఫ్లాష్ బ్యాక్ కు వెళ్ళాల్సిందే. మనకు ‘ఒక్కడు’ ‘వర్షం’ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన నిర్మాత ఎం.ఎస్.రాజు..

‘సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్’ బ్యానర్ ను స్థాపించి మొదటి ప్రయత్నం గా ‘శత్రువు’ అనే చిత్రాన్ని రూపొందించారు. 1991వ సంవత్సరం జనవరి 2న ఈ చిత్రం విడుదలయ్యింది.విజయశాంతి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం రివేంజ్ డ్రామాగానే రూపొందినప్పటికీ.. దర్శకుడు కోడి రామకృష్ణ గారు క్రైమ్ ఎలిమెంట్స్ ను జోడించి సరికొత్త పంధాలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కోట శ్రీనివాసరావు విలనిజం ఈ సినిమాకే హైలెట్ గా నిలిచిందని చెప్పొచ్చు.

ఇది కూడా ఓ పాత్ బ్రేకింగ్ మూవీనే..! ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచి 100 రోజులు ఆడింది. చిత్ర యూనిట్ సభ్యులు ‘శత్రువు’ 100 రోజుల వేడుకను ఏర్పాటు చెయ్యగా గెస్ట్ గా విచ్చేసి వీరిని అభినందించారు. ఇక బాలకృష్ణతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన చనువుతో విజయశాంతి ఆత్మీయంగా మాట్లాడుతున్న తరుణంలో ఈ ఫోటోని తీసినట్టు స్పష్టమవుతుంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus