‘కలియుగ పాండవులు’ వెనుక అంత కథ ఉందా..?

విక్టరీ వెంకటేష్ … సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు. చాలా గొప్ప నటుడు. అంతే కాదు సంపూర్ణ నటుడు కూడా.ఫ్యామిలీ ఆడియన్స్ లో ఇతనికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కామెడీ, ఎమోషనల్ సీన్స్ లో విశ్వరూపం చూపిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇతని సినిమా ప్రయాణం మొదలుపెట్టాడం ఒక ఆద్భుతంతోనే మొదలైంది అనే సంగతి చాలా మందికి తెలీదు. వెంకటేష్ హీరో అవ్వడానికి ప్రధమ కారణం సూపర్ స్టార్ కృష్ణ గారేనట.

1986 ఆగష్టు 14 న విడుదలైన సూపర్ హిట్ చిత్రం ‘కలియుగ పాండవులు’ ద్వారా వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రానికి వెంకటేష్ తండ్రి.. ‘సురేష్ ప్రొడక్షన్స్’ అధినేత అయిన దివంగత డా.డి.రామానాయుడు గారు నిర్మాత. ఆయనకి మొదట తన ఇద్దరి కొడుకులని హీరోని చెయ్యాలి అనే ఆలోచన అస్సలు లేదట. ఇద్దరినీ బిజినెస్ మెన్ లను చేద్దాం అనుకున్నారట. అయితే ‘కలియుగ పాండవులు’ చిత్రాన్ని మొదట సూపర్ స్టార్ కృష్ణ గారితో తియ్యాలి అనుకున్నారట.

దర్శకుడు రాఘవేంద్ర రావు కూడా కృష్ణ గారికి కథ వినిపించారట. అయితే కృష్ణ గారు తన బంధువు ఏ.యస్.ఆర్ ఆంజనేయులు కు ఓ చిత్రం చేస్తాను అని మాట ఇచ్చారట. దాంతో అతన్ని సహా నిర్మాతగా పెట్టుకుంటే ఈ ప్రాజెక్ట్ చేస్తాను అని చెప్పారట. అందుకు రామానాయుడు గారు ఒప్పుకోలేదు. దీంతో మిగిలిన హీరోలను గాలిస్తుండగా… ‘మీ ఇంట్లోనే హీరోని పెట్టుకుని ఊరంతా వెతుకుతావే’ అని ఓ స్నేహితుడు చెప్పడంతో… వెంటనే యూ.ఎస్ లో ఎం.బి.ఏ చేస్తున్న వెంకటేష్ కు ఫోన్ చేసి రప్పించి ఆ సినిమా చేయించారట. తరువాత ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడం… వెంకటేష్ కూడా హీరోగా బిజీ అవ్వడం జరిగిపోయాయట.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus