ఎన్టీఆర్31 దర్శక నిర్మాతలు కథపై హింట్ ఇస్తున్నారా?

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ ఇక లాంఛనమే. వచ్చే ఏడాది చివర్లో లేదా 2022 ప్రారంభంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. దీనిపై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరియు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ పరోక్షముగా ప్రకటన చేశారు. తన అసాధారణ ప్రతిభతో కెజిఎఫ్ అనే ఓ అద్భుతాన్ని చెక్కిన ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఎలాంటి చిత్రం తెరకెక్కించనున్నాడు అనే ఆత్రుత ఫ్యాన్స్ లో పెరిగిపోయింది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రం మరో విజువల్ వండర్ లా ఉంటుంది అనడంలో సందేహం లేదు.

ఐతే ఈ మూవీ కథ మరియు టైటిల్ పై మైత్రి మూవీ మేకర్స్ మరియు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎదో హింట్ ఇస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ‘ఎన్టీఆర్ న్యూక్లియర్ ప్లాంట్, దానిని ఎదుర్కోవడానికి నేను రేడియేషన్ సూట్ లో వస్తాను..’ అని ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ బర్త్ డే నాడు ట్వీట్ చేస్తే, దానికి కొనసాగింపుగా నేడు మైత్రి మూవీ మేకర్స్ ‘త్వరలో రేడియేషన్ సూట్ లో ఉన్న నిన్ను కలుస్తాం’ అని ట్వీట్ చేశారు.

అసలు ఈ రేడియేషన్ అనే పాయింట్ ఎక్కడి నుండో వచ్చిందో తెలియదు. ఎన్టీఆర్ కి కూడా అలాంటి స్టార్ డమ్ లాంటి నేమ్ లేదు. ఈ నేపథ్యంలో కావాలనే దర్శక నిర్మాతలు ఎన్టీఆర్ 31వ చిత్ర కథ లేదా టైటిల్ పై ఎదో చెప్పకనే చెవుతున్నారనే ప్రచారం మొదలైంది. మరి ఈ విషయంపై స్పష్టత రావాలంటే మరో ఏడాదికి పైగా ఎదురుచూడాలి.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus