అప్పటి వరకూ మహేష్ బాబు ఓ స్టార్ హీరో కొడుకు. కానీ అతన్ని పెద్ద స్టార్ హీరోని చేసిన చిత్రం ‘పోకిరి’. మహేష్ కెరీర్ ను గనుక ఎలోబరేట్ చెయ్యాలి అంటే… ‘పోకిరి’ చిత్రానికి ముందు… ‘పోకిరి’ చిత్రం తర్వాత అని చెప్పాలి అనడంలో అతిశయోక్తి లేదు. అప్పటి వరకూ హిట్లకు మోహమాసిపోయి ఉన్న పూరి జగన్నాథ్ తో సినిమా అంటే.. అప్పుడు మహేష్ ను కూడా చాలా మంది హెచ్చరించారట. కానీ వేటినీ లెక్క చెయ్యకుండా చేసి ఇండస్ట్రీ హిట్ అందుకుని అందరికీ షాక్ ఇచ్చాడు.
సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరో మహేష్ గురించి ఎంక్వయిరీ చేసే స్థాయికి ఎదిగాడు. అతను కూడా ప్లాపుల్లో ఉన్నప్పుడు ఈ చిత్రాన్ని రీమేక్ చేసే బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అలాంటి ఈ చిత్రం వెనుక ఓ మెగా సీక్రెట్ ఉంది అన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు.మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రం ‘స్టేట్ రౌడీ’ ని రీమేక్ చేస్తే ‘పోకిరి’ అయ్యిందట. టి.సుబ్బిరామి రెడ్డి నిర్మించిన ‘స్టేట్ రౌడీ’ చిత్రానికి బి.గోపాల్ దర్శకుడు. సిటీలో పెద్ద దాదాగా చెలామణి అవుతూ ఉన్న కాళీ చరణ్ .. ను ఓ ఇద్దరు డాన్ లు తమ వైపుకి తిప్పుకోవాలి అనుకుంటున్నారు.
చివరికి అతను ఓ మర్డర్ మిస్టరీని చేదించడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ పృథ్వి అని తెలుస్తుంది. ఇక పూరి మహేష్ తో చేసిన ‘పోకిరి’ కథ తెలిసిందే. సిటీలో ఉన్న మాఫియా ని ఏరి పారేయడానికి పండు అనే కిరాయి గూండా అవతారం ఎత్తుతాడు కృష్ణ మనోహర్ అనే పోలీస్ ఆఫీసర్. చాలా వరకూ సేమ్ లైన్ అయినప్పటికీ పూరి ఎంతో ఎంగేజింగ్ గా ‘పోకిరి’ ని తీశాడు. సో పోకిరి వెనుక ఇంత మెగా సీక్రెట్ ఉందన్న మాట.
Most Recommended Video
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!