Sri Manjunatha Movie: 20 ఏళ్ళ ‘శ్రీమంజునాథ’ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..!

  • June 22, 2021 / 06:06 PM IST

మెగాస్టార్ చిరంజీవికి మైథాలజీ మూవీస్ లో నటించి మెప్పించాలని ఓ కోరిక ఉండేది. ఆయన కెరీర్లో అన్ని రకాల పాత్రలు చేసి మెప్పించారు. కానీ దేవుడిగా నటించి మెప్పించాలి అన్న ఆయన కోరిక మాత్రం తీరలేదు. నందమూరి హీరోలకు మాత్రమే అది సాధ్యమైంది. అయితే 2001 లో వచ్చిన ‘శ్రీమంజునాథ’ చిత్రం ద్వారా చిరు తన కోరికను తీర్చుకోవాలని ప్రయత్నించారు. ఆయనకి కలిసొచ్చిన దర్శకుడు కె.రాఘవేంద్ర రావు తెరకెక్కించిన చిత్రం కావడంతో కచ్చితంగా ఇది పెద్ద హిట్ అవుతుంది అని ఆయన భావించారు.

కానీ ఈసారి కూడా చిరు కోరిక నెరవేరలేదు. 2001 వ సంవత్సరం జూన్ 22న ‘శ్రీ మంజునాథ’ విడుదలయ్యింది. నేటితో ఈ చిత్రం విడుదలయ్యి 20 ఏళ్ళు పూర్తి కావస్తోంది. పూర్తి స్థాయి శివుడి పాత్రలో చిరు ఈ చిత్రంలో కనిపిస్తారు. విడుదల రోజున ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ కమర్షియల్ గా ఈ చిత్రం మెప్పించలేదు. చిరు స్టార్ ఇమేజ్.. ఈ చిత్రం తెరకెక్కిస్తున్న టైంలో అడుగడుగునా అడ్డుపడింది అని దర్శకులు రాఘవేంద్ర రావు గారు కూడా ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. చిరు కోసం ఓ డ్యూయెట్ పెట్టడం.. శివుడు, పార్వతి దేవి లు.. ఆ పాటలో నర్తించడం వంటివి ప్రేక్షకులు డైజెస్ట్ చేసుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు.

కేవలం చిరు అభిమానులను సంతృప్తి పరచడం కోసమే ఈ పాటని ఇరికించినట్టు ఆయన తెలిపారు. ‘ఆపద్బాంధవుడు’ సినిమాలో కాసేపు శివుని గెటప్ లో కనిపించిన చిరంజీవి కి.. ఇలాంటి పాత్రని ఫుల్ లెంగ్త్ పోషించాలని కోరుకున్నారట. ఆ కోరిక తీర్చుకోవడానికి ‘శ్రీ మంజునాథ’ సినిమాలో నటించడానికి వెంటనే ఒకే చెప్పినట్లు కూడా ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అయితే చిరుని నమ్ముకుని ఈ సినిమాని కొనుగోలు చేసిన బయ్యర్లకు భారీ నష్టాలు మిగిలాయి. అయితే ప్రతీ శివరాత్రి రోజున ఈ చిత్రాన్ని వీక్షించే ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus