మరో నందమూరి- మెగా.. మల్టీస్టారర్ కు రంగం సిద్ధం..!

గతంలో కంటే కూడా ఇప్పుడు నందమూరి బాలకృష్ణ పై పెద్ద దర్శకులు ఫోకస్ పెడుతున్నారు. బాలయ్యతో సినిమాలు చెయ్యాలని ఎగబడుతున్నారు. ఈ మధ్య కాలంలో బాలయ్యకి సరైన హిట్టు లేదు. ఆయన నటించిన గత 3 చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న ‘అఖండ’ సినిమా పై భారీ అంచనాలు అయితే ఉన్నాయి కానీ.. ఆ సినిమాకి పెట్టిన బడ్జెట్ కు.. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న టికెట్ రేట్ల ఇష్యుకి ఎంత వరకు ఆ చిత్రం కలెక్ట్ చేస్తుంది అనేది కలవరపరిచే ప్రశ్న.

ఇది పక్కన పెడితే గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి వంటి దర్శకులతో బాలయ్య సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పుడు బాలయ్యతో సినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కూడా సన్నాహాలు చేస్తుండడం విశేషం. అది కూడా ఓ మల్టీస్టారర్. ఆల్రెడీ ఓ నందమూరి- మెగా మల్టీస్టారర్ అయిన ‘ఆర్.ఆర్.ఆర్’ ను రాజమౌళి రెడీ చేసాడు. ఇప్పుడు మరో నందమూరి- మెగా మల్టీస్టారర్ ను రెడీ చేయడానికి కొరటాల సన్నాహాలు చేస్తున్నాడు.

ఈ చిత్రంలో బాలయ్యతో కలిసి నటించబోయే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గా తెలుస్తుంది. చాలా వరకు స్క్రిప్ట్ పూర్తయ్యింది.మరి ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కొరటాల… చిరుతో ‘ఆచార్య’ ని కంప్లీట్ చేసే పనుల్లో ఉన్నాడు. తర్వాత ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నట్టు కూడా అనౌన్స్ చేసాడు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus