నవీన్‌ సుడి మామూలుగా లేదుగా

సినిమాలో ‘హిట్‌’ తీసుకొచ్చే మార్పు మామూలుగా ఉండదు. సింగిల్‌ నైట్‌ స్టార్లు అని అందుకే అంటుంటారు. అలా ఇటీవల ‘హిట్‌’ తీసుకొచ్చిన మార్పు చూసిన హీరో నవీన్‌ పొలిశెట్టి. ఇండస్ట్రీలోకి చాలా రోజుల క్రితం వచ్చినా, ‘ఏజెంట్‌ శ్రీనివాస్‌ ఆత్రేయ’తో తొలి హిట్‌ కొట్టినా, డబుల్‌ ఫేమ్‌ సాధించింది మత్రం ‘జాతిరత్నాలు’తోనే. ఇప్పుడు ఆ పేరు ప్రఖ్యాతలు ఎంతవరకు వచ్చాయి అంటే… తర్వాతి సినిమా టైటిల్‌ తన పేరే అయ్యేంత.

‘జాతిరత్నాలు’ తర్వాత నవీన్‌ పొలిశెట్టి సినిమా ఇదేనంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అనుష్క శెట్టి మరో ప్రధాన పాత్రధారి అని తెలుస్తోంది. ‘రా రా కృష్ణయ్య’ సినిమా తీసిన కుర్ర దర్శకుడు మహేష్‌.పి దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతోందని వార్తలొస్తున్నాయి. అందులో నవీన్‌ 20 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తే, అనుష్క 40 ఏళ్ల మహిళగా కనిపిస్తుందట. అంటే 40-20 ప్రేమకథ అన్నమాట. యూవీ క్రియేషన్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాకు ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’అనే ఆసక్తికర టైటిల్‌ అనుకుంటున్నారు.

ప్రేమ కథ అని చెబుతూనే, కాస్త ఫన్‌ ఉండేలా ఈ పేరు అయితే బాగుంటుందని చిత్రబృందం అనుకుంటోందట. శెట్టి, పొలిశెట్టి కూడా కలవడం ఓ కారణం అని చెప్పొచ్చు. తెలుగులో ఈ జోనర్‌ సినిమా రావడం ఇదే తొలిసారి అనుకోవచ్చు. మరి ఇలాంటి కథకు ఎలాంటి ఆదరణ దక్కుతోందో చూడాలి. అన్నట్లు త్వరలోనే ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభిస్తారట.

Most Recommended Video

ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!
ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళే..!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus