‘SSMB 29’ నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

మహేష్ బాబు (Mahesh)తన 29 వ సినిమాని రాజమౌళి  (S. S. Rajamouli)  దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘కథ లాక్ అయ్యింది’ అని రాజమౌళి చెప్పకనే చెప్పాడు.’ఆర్.ఆర్.ఆర్’ (RRR) తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా ఇది. కాబట్టి.. పాన్ వరల్డ్ మార్కెట్స్ ని టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించాలి అని రాజమౌళి భావిస్తున్నాడు.ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) , దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) , హృతిక్ రోషన్ (Hrithik Roshan) వంటి వారు నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వాస్తవానికి.. ఏప్రిల్ లేదా మే నెల నుండి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది అని అంతా భావించారు. కానీ ఇంకా ఆలస్యం అవుతుంది అని అందరికీ క్లారిటీ వచ్చేసింది. అందుతున్న సమాచారం ప్రకారం.. జూన్ నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. షూటింగ్ మొదలయ్యే ముందు రాజమౌళి ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి..

నటీనటుల వివరాలు, షూటింగ్ కి సంబంధించిన వివరాలు రివీల్ చేస్తారు అని సమాచారం. 2026 కి ఈ ప్రాజెక్టు ఫినిష్ చేసి రిలీజ్ చేయాలన్నది రాజమౌళి ప్లాన్. ‘శ్రీ దుర్గా ఆర్ట్స్’ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ్ (K.L.Narayana) నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారట. మరోపక్క మహేష్ బాబు.. ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అతని లుక్ కనబడకుండా ఫోటోలు పోస్ట్ చేస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus