Bigg Boss season 5: ‘బిగ్ బాస్5’ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

‘బిగ్ బాస్’ రియాలిటీ షో తెలుగులో కూడా బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 4 సీజన్లు సక్సెస్ ఫుల్ గా ముగిసాయి. ఈపాటికే సీజన్-5 కూడా ప్రారంభం కావాల్సి ఉంది… కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయింది. ఈ సీజన్ కు హోస్ట్ గా ఎవరు వ్యవహరిస్తారు? కంటెస్టెంట్లుగా ఎవరు పాల్గొంటారు? అనే విషయాల పై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. సీజన్-1ను యంగ్ టైగర్ ఎన్టీఆర్, సీజన్-2 ని నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేయగా…

సీజన్-3,4 లను కింగ్ నాగార్జున హోస్ట్ చేయడం జరిగింది.ఇక సీజన్-5 ను కూడా నాగార్జున హోస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.సీజన్ 4 కు ఎంత పారితోషికం తీసుకున్నారో.. సీజన్ 5 కి కూడా అంతే పారితోషికం తీసుకోవడానికి నాగ్ ఓకే చెప్పినట్టు సమాచారం. జూలై లో ‘బిగ్ బాస్ 5’ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయట. కంటెస్టెంట్ ల ప్రక్రియ ప్రస్తుతం జూమ్ వీడియో కాల్ ద్వారా జరుగుతున్నట్లు తెలుస్తుంది.

అంతేకాదు గత ఏడాదిలానే ఈసారి కూడా.. కంటెస్టెంట్ లకు కోవిడ్ టెస్టులు చేసి 2 వారాల పాటు క్వారెంటైన్ లో పెడతారట. అటు తర్వాత మళ్ళీ కోవిడ్ టెస్ట్ చేసి రిజల్ట్ నెగిటివ్ గా నిర్ధారణ అయితే కంటెస్టెంట్ లను హౌస్ లోకి పంపిస్తారు అని వినికిడి. త్వరలోనే సీజన్ 5 కు సంబంధించిన ప్రోమోలు కూడా రెడీ అవుతాయని సమాచారం.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus