ఆనంద్ దేవరకొండ.. టాలీవుడ్లో ఉన్న యంగ్ హీరోల్లో ఒకరు. విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతను.. ‘దొరసాని’ ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ‘పుష్పక విమానం’ ‘హైవే’ వంటి చిత్రాల్లో నటించాడు. ఇందులో ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ మంచి సక్సెస్ అందుకుంది. అయితే ఆ సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వడంతో ఆనంద్ కి థియేట్రికల్ సక్సెస్ మిస్ అయ్యిందని చెప్పాలి. ఇదంతా పక్కన పెడితే.. తన అన్న విజయ్ దేవరకొండలాగే ఆనంద్ దేవరకొండ కూడా ఎక్కువగా ట్రోలింగ్ ను ఫేస్ చేస్తూ వచ్చాడు అని చెప్పాలి.
‘చిన్న కొండ’ ‘బుల్లి కొండ’ అంటూ ఆనంద్ (Anand Devarakonda) ను అదే పనిగా ట్రోల్ చేసిన బ్యాచ్ చాలా మందే ఉన్నారు. కానీ ‘బేబీ’ సక్సెస్ తో అతను హిట్ ట్రాక్ ఎక్కడమే కాకుండా ఆ ట్రోలింగ్ కి కొంత అడ్డుకట్ట వేసాడు అని చెప్పవచ్చు. ‘బేబీ’ సినిమా చూశాక.. ఈ పాత్రకి అతనైతేనే కరెక్ట్ అనే భావన అందరికీ కలిగింది. ‘అర్జున్ రెడ్డి’ లాంటి పాత్ర బేబీ ద్వారా ఇతనికి కూడా దొరికినట్లయింది. ఆ పాత్రకి ఇతను న్యాయం చేశాడు. ఈ సినిమా కోసం ఆనంద్ చాలా కష్టపడ్డాడు.
వేరే సినిమా ఆఫర్స్ వచ్చినా పారితోషికానికి కనెక్ట్ అవ్వకుండా దాదాపు రెండేళ్లు ‘బేబీ’ కథ పై వర్క్ చేశాడు. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతుంది. మరి ఈ సక్సెస్ ట్రాక్ ను ఆనంద్ కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి.
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!
సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు