సక్సెస్ రాకపోతే.. ఏమైపోతానో : ఆనంద్ దేవరకొండ

రౌడీ బాయ్… విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది కానీ కమర్షియల్ గా మాత్రం నిలబడలేక ప్లాప్ గా మిగిలింది. అయితే హీరో ఆనంద్, అలాగే హీరోయిన్ శివాత్మిక.. నటనలకి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఏమాత్రం తడబడకుండా.. నటనలో సహజత్వం చూపించారు వీరిద్దరు. తాను హీరోగా ఓకే అనిపించుకోవడంతో ఆనందంగా ఉన్నాను.. అంటున్నాడు ఆనంద్ దేవరకొండ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికరమైన విషయాల్ని తెలిపాడు ఆనంద్ దేవరకొండ.

ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ ..”నేను మంచి జాబ్ వదులుకుని సినిమాల్లోకి వచ్చాను. నాకు సక్సెస్ రాకపోతే .. ఆడియన్స్ ఆదరించకపోతే ఆ తరువాత ఏం చేయాలనే ఒక ఆలోచన ఉండేది. ఇప్పుడు కొత్త దర్శకులు ఎక్కువమంది వస్తున్నారు. కొత్త ఆర్టిస్టులను ప్రోత్సహిస్తున్నారు. అందువలన నాకంటూ చోటు ఉంటుంది అనే ఒక నమ్మకం ఏర్పడింది. ఇది నేను ప్రయోగం చేయవలసిన సమయమే అనిపించింది. అలాంటి పరిస్థితుల్లో నాన్న .. అన్నయ్య ఇద్దరూ కూడా నాకు మంచి ధైర్యాన్నిచ్చారు. ఆ ధైర్యంతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాను. ‘దొరసాని’ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.” అంటూ చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus