Tanu Weds Manu 3: రెండుసార్లు వచ్చారు అలరించారు.. మూడోసారి మెప్పిస్తారా?

బాలీవుడ్‌లో చిన్న సినిమాగా వచ్చి పెద్ద సినిమాగా మారింది అనే మాటలకు ఓ నిదర్శనం కావాలి అంటే.. ‘తను వెడ్స్‌ మను’ (Tanu Weds Manu 3) అనే సినిమాను ఉదాహరణగా చెప్పొచ్చు. మాధవన్‌, కంగనా రనౌత్‌ జంటగా తెరకెక్కిన ఈ సినిమా 2015లో వచ్చి అదిరిపోయే విజయాన్ని అందుకుంది. ఆ సమయంలో బాలీవుడ్‌లో అమితమైన ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్న సినిమాల్లో ఇదీ ఒకటి. ఇప్పుడు దీనికి మరో సీక్వెల్‌ రెడీ అవుతోంది. అదేంటి.. ‘తను వెడ్స్‌ మను రిటర్న్స్‌’ అని ఓ సీక్వెల్‌ వచ్చింది కదా అనుకుంటున్నారా? అవును మీరు చెప్పింది కరెక్టే.

Tanu Weds Manu 3

అయితే ఇప్పుడు వస్తోంది రెండో సీక్వెల్‌. సినిమా దర్శకుడు ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ ప్రస్తుతం ఈ ప్రయత్నాల్లోనే ఉన్నారట. ‘తను వెడ్స్‌ మను 3’ (Tanu Weds Manu 3) కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మళ్లీ కొత్త కథ, పాత్రలతో రావడమంటే పెద్ద బాధ్యతే. కానీ ఆ ఆలోచనల్లోనే ఉన్నాను అని ఆయన చెప్పారు. ఈ సినిమా ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటే ఇప్పటికే మూడో భాగం తీసేసేవాణ్ని. అయితే ప్రేక్షకులకు భిన్నమైన కథను, కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకుంటున్నాను.

దాని కోసం స్క్రిప్ట్‌ పనుల్లోనే ఉన్నాం. త్వరలో ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటిస్తాను అని ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ (Aanand L. Rai)  చెప్పారు. అయితే ఎప్పుడు, ఏంటి అనే విషయం చెప్పలేదు. ఆర్‌.మాధవన్ (Madhavan) , కంగనా రనౌత్‌ (Kangana Ranaut) భార్యాభర్తలుగా సందడి చేసిన ఆ సినిమా కథకు ఈ సారి ఎలాంటి ఫ్లేవర్‌ యాడ్‌ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

సుమారు 9 ఏళ్ల తరవాత మళ్లీ వస్తున్న తను, మనుల హంగామాలో మాధవన్‌, కంగననే ఉంటారా? లేక కొత్త జోడీని తీసుకుంటారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ ఇద్దరు నటుల ఫేమ్‌ అప్పటిలా లేదు. ఈ నేపథ్యంలో కొత్త తను, కొత్త మను వస్తారంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus