Anandam movie: లవ్‌స్టోరీల్లో సెన్షేషన్ అయిన..’ఆనందం’ తెలుగులోనే కాదు, అక్కడా హిట్టే..!!

మాస్ మసాలా సినిమాలు, ఫ్యాక్షన్ చిత్రాలు తెలుగు తెరను దున్నేస్తున్న కాలంలో ఇండస్ట్రీని లవ్ ట్రాక్ వైపు నడిపించిన సినిమా ‘‘ఆనందం’’. తెలుగులో తెరకెక్కిన ప్రేమకథా చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీ ‘ఆనందం’. అప్పుడు థియేటర్లలో కలెక్షన్ వర్షం కురిపించిన ఈ సినిమా ఇప్పుడు టీవీల్లో వచ్చినా సరే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కామెడీ సినిమాల స్పెషలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనువైట్ల తెరకెక్కించిన ఈ ఫీల్‌గుడ్‌ లవ్‌ స్టోరీ అప్పటికీ , ఇప్పటికీ, ఎప్పటికీ ఫ్రెష్‌ లుక్‌తో ఎంటర్‌టైన్ చేస్తూనే వుంటుంది.

ఈ సినిమా ఎందరికో లైఫ్ ఇచ్చింది. దర్శకుడిగా శ్రీనువైట్ల కెరీర్‌ను మలుపు తిప్పగా.. హీరో ఆకాశ్‌ను ఓవర్‌నైట్‌ స్టార్‌ని చేసింది. మ్యూజిక్ డైరెక్టర్‌గా అప్పుడప్పుడే ఇండస్ట్రీకి పరిచయమైన దేవీశ్రీప్రసాద్‌‌ను మరింత దూసుకెళ్లేలా చేసింది. కాలేజీలో హీరో-హీరోయిన్ల అల్లర్లు, ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే లవ్‌ ట్రాక్‌, హౌస్‌ ఓనర్స్‌గా బ్రహ్మానందం, ఎం.ఎస్‌ నారాయణ, కాలేజీలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం, చిత్రం శీను, శివారెడ్డి, బబ్లూ పండించిన కామెడీ ఈ సినిమాకు అదనపు బలం.

ఈ సినిమా విడుదలై ఇటీవలే 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2001లో విడుదలైన ఆనందం సినిమా ఆంధ్రదేశంలో కుర్రకారుని ఒక ఊపు ఊపింది. ఎన్నో థియేటర్లలో ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా 200 రోజులు ప్రదర్శించబడింది. ఇంతటి సంచలనం సృష్టించిన ఈ సినిమాపై పక్క ఇండస్ట్రీల చూపు కూడా పడింది. అందుకే తమిళంలో ‘ఇనిదు ఇనిదు కాదల్‌ ఇనిదు’, కన్నడలో ‘ఆనంద’ పేరుతో రీమేక్ అయి మంచి టాక్‌తో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus