ఆకాష్, రేఖ హీరో హీరోయిన్లుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆనందం’. వెంకట్, తనూరాయ్ కూడా ఇందులో కీలక పాత్రలు పోషించారు. ‘ఉషాకిరణ్ మూవీస్’ బ్యానర్ పై దివంగత స్టార్ ప్రొడ్యూసర్ రామోజీరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. తనికెళ్ళ భరణి, రామోజీరావు, చంద్రమోహన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ వంటి స్టార్స్ ఈ సినిమాలో అత్యంత కీలక పాత్రలు పోషించారు.
2001 సెప్టెంబర్ 28న పెద్దగా అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘ఆనందం’ చిత్రం. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుని.. మౌత్ టాక్ తో షో, షోకి కలెక్షన్స్ పెంచుకుంటూ పోయి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, కామెడీ ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. 30 కేంద్రాల్లో 50 రోజులు, 7 కేంద్రాల్లో 100 రోజులు ఆడి సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా.
ఈ సెప్టెంబర్ 28 తో ‘ఆనందం’ రిలీజ్ అయ్యి 24 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఈ నేపథ్యంలో క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 2.46 cr |
సీడెడ్ | 1.06 cr |
ఉత్తరాంధ్ర | 1.26 cr |
ఈస్ట్ | 0.75 cr |
వెస్ట్ | 0.59 cr |
గుంటూరు | 0.90 cr |
కృష్ణా | 0.92 cr |
నెల్లూరు | 0.48 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 8.42 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ | 1.63 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 10.05 cr |
‘ఆనందం’ చిత్రం చిత్రం రూ.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఫుల్ రన్ ముగిసేసరికి ఏకంగా రూ.10.05 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా బయ్యర్లకు రూ.8.05 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది ఈ సినిమా. మొదట తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా 2వ వారం నుండి ఎక్కువ స్క్రీన్స్ దక్కించుకుంది. ఈ సినిమా కొనుగోలు చేసిన ప్రతి బయ్యర్ లాభాలు ఆర్జించారు. ‘ఆనందం’ తర్వాత శ్రీను వైట్లకి డిమాండ్ పెరిగింది. అలాగే హీరో ఆకాష్ కి ఈ ఒక్క హిట్ వల్ల ఏకంగా 25 సినిమా ఆఫర్లు వచ్చాయి.