Anandhi: ఆకట్టుకుంటున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ హీరోయిన్ ఇంట్రో టీజర్..!

సుధీర్‌ బాబు హీరోగా ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో ‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి..ఇప్పటి వరకు విడుదల చేసిన వీడియో గ్లిమ్ప్స్ మరియు ఫస్ట్ సింగిల్ వంటి వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ‘భ‌లే మంచి రోజు, ‘ఆనందో బ్రహ్మా’ ‘యాత్ర’ వంటి హిట్ సినిమాలను నిర్మించిన ’70.ఎం.ఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్’ అధినేతలు.. విజయ్ చిల్లా, శశి దేవి‌రెడ్డి లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం నుండీ హీరోయిన్ ఆనంది ఇంట్రో టీజర్ ను కూడా విడుదల చేశారు.ఈ పాత్రలో ఆనంది కనిపించబోతుంది.ఆమె ఈ మధ్య కాలంలో మంచి మంచి పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో ఈమెకు మంచి క్రేజ్ ఏర్పడింది. ‘జాంబీ రెడ్డి’ తో తెలుగులో కూడా మంచి క్రేజ్ ను ఏర్పరుచుకుంది. ఇక ‘శ్రీదేవి సోడా సెంటర్’ లో ఆమె టైటిల్ రోల్ పోషిస్తుండడం విశేషం. ఈ మూవీలో ఆమె సోడాల షాప్ ను నడుపుకునే అమ్మాయిగా కనిపించబోతుంది.

ఈ పాత్రకి ఈమె రైట్ ఛాయిస్ అనిపిస్తుంది.ఎంతో హుషారుగా ఆమె ఈ పాత్రని పోషించినట్టు ఈ టీజర్ చూస్తే స్పష్టమవుతుంది. ‘గోలి గొంతులోకి దిగుద్ది జాగ్రత్త’ ‘శ్రీదేవి.. సోడాల శ్రీదేవి ఇక్కడ’ అంటూ ఆమె పలికిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ‘ ‘రంగస్థలం’ లో ‘రామలక్ష్మీ'(సమంత) పాత్ర గుర్తుకొచ్చే విధంగా ఈ పాత్ర ఉండేలా ఉంది’ అంటూ సోషల్ మీడియాలో కొందరు నెటిజెన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా ఈ టీజర్ ను ఓ లుక్కేద్దాం రండి :


ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus