Kalaavathi Song: మేం కలిస్తే సౌత్‌ ఇండియా రికార్డులే అంటున్న రచయిత

  • February 17, 2022 / 11:30 AM IST

సినిమాలో హీరోయిన్‌ పేరుతో తమ ప్రేయసిని పిలుచుకుని మురిసిపోతుంటారు కుర్రకారు. తాజాగా అలాంటి పేరుగా మారిపోయింది కళావతి. ‘సర్కారు వారి పాట’ సినిమాలో కళావతి పేరుతో ఓ పాట ఉంది. ఇటీవల ఆ పాట లిరికల్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. దాంతో మహేష్‌బాబు ఫ్యాన్స్‌ తెగ మురిసిపోతున్నారు. ఆ పాట కూడా వరుస రికార్డులు సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో పాట రచయిత అనంత శ్రీరామ్‌ తన భావాలను పంచుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురు ‘రామ్‌’ల కాన్సెప్ట్‌ చెప్పారు.

Click Here To Watch

‘కళావతి’ పాట గురించి మాట్లాడుకునే ముందు ఓసారి ‘గీత మేడమ్‌’ గురించి మాట్లాడుకుందాం. అదేనండి ‘గీత గోవిందం’లో గీత మేడమ్‌. ‘ఇంకేం ఇంకేం కావాఎ’ అంటూ ఆ మధ్య అదరగొట్టేసింది పాట. ఆ పాటకు, ఈ పాటకు చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకే ఇప్పుడు మాట్లాడదాం అంటున్నాం. సిధ్‌ శ్రీరామ్, అనంత శ్రీరామ్‌.. ఇలా ఇద్దరు రాముల కలయికలో ‘గీతగోవిందం’ సినిమాలో ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’ పాట వచ్చింది. ఈ ఇద్దరికి మూడో ‘రామ్‌’ కలపాలి అంటున్నారు అనంత శ్రీరామ్‌. అతనే దర్శకుడు పరశు‘రామ్‌’.

ఆ రోజుల్లో ఈ పాట సృష్టించిన రికార్డుల గురించి తెలిసిందే. ఇప్పటికీ ఈ పాట యువత మొబైల్స్‌లో మారుమోగుతోంది అంటే ఎంత విజయం దక్కించుకుందో తెలుస్తోంది. ఇప్పుడు అదే కాంబోలో ‘కళావతి’ సాంగ్‌ వచ్చింది. అప్పటిలానే ఈ పాట కూడా రికార్డులు సృష్టిస్తోంది. దీని గురించి అనంత శ్రీరామ్‌ తనదైన శైలిలో ‘ఇంకేం ఇంకేం..’ పాట అప్పుడు సౌత్‌ ఇండియా రికార్డ్‌ సృష్టించిందని దర్శకుడు పరశురామ్‌ కాల్‌ చేశారు. ఇప్పుడూ అతనే కాల్‌ చేసి ‘మళ్లీ సౌత్‌ ఇండియా రికార్డ్‌ కొట్టేశాం’ అని చెప్పారు. దీంతో చాలా ఆనందంగా అనిపించింది అని చెప్పారు.

పాట అందరికీ బాగా నచ్చేసింది. అయితే ‘అన్యాయంగా మనుసుని కెలికావే.. అన్నం మానేసి నిన్నే చూసేలా’ అనే వాక్యానికి మంచి రెస్పాన్స్‌ వస్తోంది అని చెప్పారు అనంత శ్రీరామ్‌. ‘పోకిరి’ సినిమాలో మహేష్‌బాబు ఇలియానా వెంటపడినట్లు పాట ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ‘కళావతి’ పాటతో అది జరుగుతోంది. కాబట్టి ఆయన్ను దృష్టిలో పెట్టుకొని పాట రాస్తే అభిమానులు ఫిదా అవుతారు అనిపించింది. అందుకే ఇలా రాశాను. అనుకున్నట్లే అభిమానులకు బాగా నచ్చేసింది. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ పాట ఇంకా ఎక్కువ నచ్చుతోంది అని చెప్పారు అనంత శ్రీరామ్‌.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus