Godfather: చిరు అభిమానానికి ఫిదా అయినా ఏపీ ఎస్పీ .. ట్వీట్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విజయదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా అన్ని ప్రాంతాలలోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా టైటిల్స్ లో ఆంధ్రప్రదేశ్ అనంతపురానికి చెందిన ఎస్పీ పకీరప్ప పేరును ప్రత్యేకంగా వేయడమే కాకుండా చిత్ర బృందం ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఈ విషయంపై ఎస్పి పకీరప్ప స్పందిస్తూ మెగాస్టార్ చిరంజీవి అభిమానానికి సంతోషం వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విధంగా గాడ్ ఫాదర్ టైటిల్స్ లో పకీరప్ప పేరును వేయడంతో ఎంతోమంది ఈయన పేరు వేయడానికి గల కారణం ఏంటి అని ఆరా తీస్తున్నారు.అయితే ప్రత్యేకంగా అనంతపురం ఎస్పీ పేరు వేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే గాడ్ ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో ఎలాంటి అవరోధాలు ఏర్పడకుండాఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా చిత్ర బృందం ఎస్పీ పకీరప్పకు కృతజ్ఞతలు తెలుపుతూ సినిమా టైటిల్స్ లో ఆయన పేరు ప్రకటించారు. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక కోసం పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడమే కాకుండా మరోవైపు జోరు వాన కురుస్తున్నప్పటికీ

ఎలాంటి ఆటంకం లేకుండా ఎలాంటి గొడవలు జరగకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు చిత్ర బృందం అభినందనలు తెలియజేశారు. ఇలా టైటిల్స్ లో తన పేరు ఉండడంతో ఎస్పీ పకీరప్ప ఈ విషయంపై స్పందిస్తూ మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus