నన్ను బాడీ షేమింగ్‌ చేశారు.. చాలా బాధనిపించేది: స్టార్‌ హీరోయిన్‌!

సెలబ్రిటీలు అయిపోతే కావాల్సినంత గుర్తింపు వస్తుంది. అయితే సైడ్‌ ఎఫెక్ట్స్‌గా వద్దన్నా ఆపనంత నెగిటివిటీ వస్తుంది. ఎంత మంచివాళ్లు అయినా ఎవరో ఒకరు ఏదో అంటూనే ఉంటారు. దీంతో చాలామంది సెలబ్రిటీలు నెగిటివిటీకి, బాడీషేమింగ్‌కి ఇప్పుడు సిద్ధమైపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎక్కువగా సినిమా వాళ్లకే ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ నెపోకిడ్స్‌ అంటూ క్లాస్‌గా పిలుచుకునే వారసులకు ఈ ఇబ్బంది చాలా ఎక్కువ. ఈ విషయమై ఇప్పటికే చాలామంది నటులు స్పందించారు.

తాజాగా మరో నెపోకిడ్‌ (Ananya Panday) అనన్య పాండే కూడా దీని గురించి మాట్లాడింది. పర్సనల్‌గా ఇప్పటికీ కొన్ని సమయాల్లో ఇన్‌ సెక్యూరిటీ ఫీల్‌ అవుతూనే ఉంటాను అని చెబుతూ బాధపడింది అనన్య పాండే. ‘డ్రీమ్‌ గర్ల్‌ 2’ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల్ని పలకరించిన అనన్య… ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలో కెరీర్‌ గురించి, పర్సనల్‌ విషయాల గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేసింది. సినిమా పరిశ్రమలోకి వచ్చాక బాడీ షేమింగ్‌ – నెగిటివిటీ వల్ల చాలా సవాళ్లను ఎదుర్కొన్నాను అని చెప్పింది.

ఆ నెగిటివిటీ వల్ల ఇప్పటికీ ఇన్‌సెక్యూరిటీ ఫీల్‌ అవుతుంటాను అని తెలిపింది. ట్రోల్స్‌ ఎంతగానో బాధిస్తాయి, అందుకే వాటికి దూరంగా ఒంటరిగా ఉండాలని అందరూ అనుకుంటారు. నేను కూడా అలానే అనుకుంటాను. అలా ఉంటూ, నా మనసు చెప్పే మాటల్ని వింటూ నన్ను నేను మార్చుకుంటూ వస్తున్నాను అని చెప్పింది అనన్య. సోషల్‌ మీడియా గురించి మాట్లాడుతూ… సామాజిక అనుసంధాన వేదికలు ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.

నా చిన్నతనంలో స్మార్ట్‌ ఫోన్ల వినియోగం తక్కువగా ఉండేది. అందుకే అప్పుడు ప్రశాంతంగా అనిపించేదేమో. ఇప్పుడు ఫోన్ల వాడకం పెరిగిపోయింది. సోషల్‌ మీడియా కామెంట్లు యూత్‌పై చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. అలాంటి వాటికి వీలైనంత దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పింది. ఇక అనన్య సినిమాల సంగతి చూస్తే… ‘కాల్‌ మీ బే’తో త్వరలో ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ‘ఖో గయే హమ్‌ కహా’, ‘కంట్రోల్‌’, ‘శంకరా’ సినిమాలతో వెండితెర కెరీర్‌ను బిజీగా ఉంచుకుంది.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus