Ananya Pandey: దారుణంగా అనన్య లైగర్ రెమ్యూనరేషన్?

ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి తెరకెక్కే ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పాన్ ఇండియా సినిమాలు కావడంతో నార్త్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాకి మంచి మార్కెట్ రావడం కోసం ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్లను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా అలియా భట్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.తాజాగా లైగర్ సినిమా ద్వారా అనన్య పాండే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ అనన్య పాండే జంటగా నటించిన చిత్రం లైగర్.ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కెరియర్ లో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం అనన్య పాండేని తీసుకోవడంతో ఈమెకు కూడా భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ ఇచ్చి ఉంటారని అందరూ భావిస్తున్నారు.

ఈ సినిమా కోసం అనన్య పాండే తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే. ఈ సినిమా కోసం ఈ బ్యూటీ కేవలం మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నారట. అయితే విజయ్ దేవరకొండతో పోలిస్తే ఈమె రెమ్యూనరేషన్ చాలా తక్కువ అయినప్పటికీ ఈమె మాత్రం తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొని తన కెరియర్ ను బిల్డ్ చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ట్రైలర్ చూస్తుంటే మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని తెలుస్తుంది.ఈ సినిమా కనుక అద్భుతమైన హిట్ అందుకుంటే మాత్రం తనకు తెలుగులో కూడా వరుస అవకాశాలు వస్తాయి అనడంలో సందేహ పడాల్సిన పనిలేదు. మరి ఈ సినిమా అనన్య పాండేకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus