Ananya Raj: యంగ్ టాలీవుడ్ హీరోయిన్ కన్నుమూత.. నెల తర్వాత బయటకు
- August 18, 2026 / 02:49 PM ISTByFilmy Focus Desk
బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేసి పేరు తెచ్చుకుని, తెలుగులో ఒకే సినిమా చేసి ఆగిపోయిన యువ కథానాయిక అనన్య రాజ్ (27) కన్నుమూశారు. అయితే ఈ విషయం దాదాపు నెల రోజుల తర్వాత బయటకు వచ్చింది. జులై 15న అనన్య చనిపోయినట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించడం గమనార్హం. జులై 15న తెల్లవారు జామున అనన్య తుది శ్వాస విడిచింది. ఆమె నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూసింది. ఏడాదికిపైగా శారీరక, మానసిక ఇబ్బందులు పడిందని సమాచారం. ఆ ఇబ్బందల్ని అధిగమించడానికి అనన్య యోధురాలిలా పోరాడిందని తెలిపారు..
Ananya Raj
అనన్య అక్టోబరు 22, 1998న ముంబయిలో జన్మించింది. 2016లో ‘7అవర్స్ టు గో’ సినిమాతో హిందీ చిత్రసీమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘ది ఫైనల్ ఎగ్జిట్’ అనే సినిమాతో పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత 2022లో తెలుగులో నవీన్ చంద్రతో ‘తగ్గేదే లే’ అనే సినిమా చేసింది. ఇవి కాకుండా షార్ట్ ఫిల్మ్‌లు, మ్యూజిక్ వీడియోలు కూడా చేసింది. దీంతో పాటు ‘మద్రాసి గ్యాంగ్’ అనే సినిమా కూడా చేసింది. ఆమె చేసి మ్యూజిక్ వీడియోలను టి సిరీస్, జీ మ్యూజిక్, టైమ్స్ మ్యూజిక్ లాంటి సంస్థలు రూపొందించాయి.














