మరో అగ్ర హీరో సినిమాలో అనసూయ
- February 23, 2021 / 11:32 AM ISTByFilmy Focus
జబర్దస్త్ గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ చాలా కాలం తరువాత వరుసగా సినిమాలను ఒకే చేస్తోంది. ఒక వైవు టీవీ ప్రోగ్రామ్స్ మరోవైపు సినిమా షూటింగ్స్ తో తీరిక లేకుండా బిజీగా మారుతొంది. ఏ మాత్రం గ్యాప్ లేకుండా నచ్చిన పాత్రలను ఓకే చేస్తున్న ఈ బ్యూటీ ఇటీవల పరభాషా సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి క్షణం సినిమా తరువాత నుంచి అనసూయ సెలెక్షన్ కూడా కొంత డిఫరెంట్ గా ఉందనే చెప్పాలి.
రెగ్యులర్ కమర్షియల్ పాత్రలకు దూరంగా ఉంటూ ఆడియేన్స్ కు ఈజీగా కనెక్ట్ అయ్యే పాత్రలను సెలెక్ట్ చేసుకుంటోంది. ఇక త్వరలో పక్క ఇండస్ట్రీలో కూడా ఈ యాంకర్ బిజీగా మారే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. తమిళ్ లో ఆఫర్స్ బాగానే వస్తున్నాయట గాని అవేవి కూడా అంతగా కనెక్ట్ అవ్వడం లేదట. ఇక రీసెంట్ గా మలయాళం నుంచి ఒక ఆఫర్ రావడంతో వెంటనే ఒప్పేసుకున్నట్లు తెలుస్తోంది. అదికూడా స్టార్ హీరో మమ్ముట్టి సినిమా అని తెలుస్తోంది.

మళయాళం స్టార్ మమ్ముట్టి ప్రస్తుతం భీష్మ పర్వం అనే ఒక సినిమా చేస్తున్నాడు. అందులో ఒక ముఖ్యమైన పాత్ర కోసం చిత్ర దర్శకుడు ఇటీవల అనసూయను కలిసినట్లు టాక్ వస్తోంది. పాత్ర బలంగా ఉండడంతో అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం తెలుగులో అనసూయ రెండు సినిమాలతో బిజీగా ఉంది.
Most Recommended Video
పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!















