Anasuya: కెరియర్ విషయంలో పెద్ద సాహసమే చేస్తున్న అనసూయ!

  • February 3, 2024 / 02:35 PM IST

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు పూర్తిగా గుడ్ బై చెప్పి వెండితెరపై నటిగా సందడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈమె వెండితెరపై సినిమా అవకాశాలను అందుకుంటూ వరుసగా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక అనసూయ నటించే పాత్రలన్నీ కూడా చాలా విభిన్నంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల అనసూయ నటించిన విమానం సినిమాలో ఈమె ఏకంగా వేశ్య పాత్రలో నటించారు

సాధారణంగా ఇలాంటి పాత్రలలో నటించడానికి నటీమణులు కాస్త వెనకడుగు వేస్తారు కానీ అనసూయ మాత్రం ఇలాంటి పాత్రలలో నటించే సాహసమే చేస్తున్నారని చెప్పాలి. అయితే తాజాగా ఈమె మరో సాహసభరితమైన పాత్రలో నటించడానికి సిద్ధమయ్యారు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది. అనసూయ ఓ బడా ప్రాజెక్టుకు కమిట్ అయ్యారని ఇందులో ఏకంగా ఈమె తల్లి పాత్రలో నటించబోతున్నారు అంటూ ఒక వార్త చెక్కర్ల కొడుతోంది.

ఇక ఈమె స్టార్ హీరోకి తల్లిగా నటించడం గమనార్హం. హీరో చిన్నప్పటి పాత్రకు సంబంధించిన సన్నివేశాలలో హీరో తల్లిగా అనసూయ కనిపించబోతున్నారు అంటూ ఈ వార్త వైరల్ గా మారింది. ఈ విధంగా అనసూయ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ఒకవేళ ఇలాంటి పాత్రలో కనుక ఈమె నటిస్తే నిజంగానే సాహసం చేస్తున్నారని చెప్పాలి.

ఇలాంటి పాత్రలలో నటించడంతో ఆమె (Anasuya) కెరియర్ పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఈమె ఎక్కువగా ట్రోల్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని పలువురు భావిస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus