Anasuya: అలా వెళ్లేతేనే హీరోయిన్ ఛాన్స్ వస్తాయంటే నాకు అవసరం లేదు : అనసూయ

యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు వరుస సినిమాలతో అలరిస్తున్నారు నటి అనసూయ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ‘అత్తారింటికి దారేది’ సినిమాలోని పాటలో నటించకపోవడానికి గల కారణాన్ని వివరించారు. అలాగే ఒకప్పటి కంటే ఇప్పుడు తనలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. ‘‘అత్తారింటికి దారేది’ సినిమాలో ఒక పాటలో అవకాశం వచ్చింది. అందులో ఇంకా చాలా మంది హీరోయిన్స్‌ ఉన్నారని నేను చేయనని చెప్పా. గుంపులో ఒకరిగా నటించడం నాకు నచ్చదు.

నాకంటూ ప్రత్యేకత ఉండాలని కోరుకున్నా. అందుకే ఆ పాటకు నో చెప్పా. ఆ అవకాశాన్ని తిరస్కరించినందుకు చాలా మంది నన్ను విమర్శించారు. అయితే నేను నో చెప్పడం తప్పు కాదు.. కానీ, నో చెప్పే విధానం తప్పేమో అని నాకు అనిపించింది. మొదటి నుంచి ముక్కుసూటి మనిషిని. అందుకే కొంచెం కఠినంగా చెప్పాను. ఆ పాటలో నటించనందుకు ట్విటర్‌లో పెద్ద వార్‌ జరిగింది. దీంతో త్రివిక్రమ్‌కు సారీ చెప్పాను’’ అని అనసూయ అన్నారు.

‘‘షూటింగ్స్‌లో నా పని నేను (Anasuya)  చూసుకుని వెళ్తుంటాను. సినిమా అయ్యాక జరిగే పార్టీలకు చాలా దూరంగా ఉంటా. ఈ కారణంగానే హీరోయిన్ అవకాశాలను కూడా కోల్పోయాను. అలా పార్టీలకు వెళ్తేనే అవకాశాలు వస్తాయంటే నేను వాటిని ప్రోత్సహించను. ఒకప్పుడు ఏదైనా అవకాశం వస్తే.. అందులో నాకే ప్రాధాన్యం ఉండాలనుకున్నా. కానీ, ఇప్పుడు నాలో మార్పు వచ్చింది. ఎలాంటి పాత్రలోనైనా నా నటనతో గుర్తింపు తెచ్చుకోగలనని నమ్మకం కలిగింది’’ అని చెప్పారు.

ఇక సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ.. ‘‘ప్రతి మహిళా స్వేచ్ఛ కోరుకుంటుంది. నా భర్త నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. సోషల్ మీడియాలో కామెంట్స్‌ పెట్టే వాళ్ల ఇళ్లలో మహిళలను తలచుకుంటే నాకు జాలి వేస్తుంటుంది. విమర్శించేవాళ్లు ఎన్ని అంటున్నా.. నా పోస్ట్‌లు చూసి స్ఫూర్తిపొందే వాళ్లు చాలా మంది ఉంటారు’’ అని వెల్లడించారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus