Anasuya: లస్ట్‌ అంటే అదే కదా.. దానికి సిగ్గెందుకు? అనసూయ కామెంట్స్‌ వైరల్‌!

అనసూయ (Anasuya) సోషల్‌ మీడియా లైవ్‌లోకి వచ్చినా, ఎవరికైనా ఇంటర్వ్యూ ఇచ్చినా చిన్నపాటి సునామీనే వస్తుంది. ఎందుకంటే ఆమె ఎంచుకునే టాపిక్‌, రియాక్ట్‌ అయ్యే పాయింట్లు అలా ఉంటాయి మరి. ఎలాంటి ఇష్యూ మీదైనా ఆమె మాట్లాడగలుగుతుంది. అలాగే ఆమె చెబితే ఆ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న చర్చ 20 ఏళ్ల అబ్బాయి.. 35 ఏళ్ల మహిళ మధ్య ఉన్న రిలేషన్‌ గురించి మాట్లాడింది.

Anasuya

యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ ఇటీవల అనసూయను ఓ ఇంటర్వ్యూ చేశారు. అందుకులో ఆ మాట ఈ మాటా మాట్లాడుతూ నేటి తరం యువత, వాళ్ల ఆలోచనలు అనే టాపిక్‌ దగ్గరకు వచ్చింది. అప్పుడు నిఖిల్‌ ఈ జనరేషన్‌లో దాదాపు దాదాపు 70 శాతం అబ్బాయిలు తమ కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్లను కోరుకుంటున్నారట. 20 నుండి 25 కానీ వయసున్న వాళ్లు 30 నుండి 35తో ఉండాలని అనుకుంటున్నారట అని ఇంకాస్త క్లారిటీ ఇచ్చారు.

ఆ ప్రశ్న విన్న అనసూయ.. తనదైన స్టైల్‌లో ‘సెXవల్‌గానా’ అని అడిగింది. అంటే అది అది కాదు లస్ట్ అని అన్నాడు. అనసూయ ఆ మాటకు లస్ట్ అంటే సెX కదా అని అంది. అక్కడితో కాకుండా అసలు ఆ టాపిక్‌ గురించి ఎందుకు పాపం అని అనుకుంటున్నారో తెలియడం లేదని, బహిరంగంగా దానిని చేయాలి అని అనను కానీ, మాట్లాడితే తప్పుపట్టాల్సిన పనిలేదని చెప్పింది. అసలు ఆ విషయం గురించి సిగ్గుపడాల్సిన అవసరం లేదు అనేసింది క్లారిటీ ఇచ్చేసింది.

దీంతో అనసూయ ఏంటి ఇలా మాట్లాడేసింది అనే చర్చ మొదలైంది. అంతేకాదు సెX అనేది ఓ పాయింట్‌గా మాత్రమే చూడాలి అనేది ఆమె పాయింట్‌. ఈ విషయమే కాదు.. తన బికినీల గురించి, వాటి మీద వస్తున్న కామెంట్ల గురించి మాట్లాడింది. తనను కామెంట్లు చేస్తున్న వాళ్లను ఆంబోతులు అని కూడా పిలిచింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus