Anasuya: నేను బ్రతుకుతున్నది తినడం కోసం.. అనసూయ కామెంట్స్ వైరల్!

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అనసూయ ఎన్నో విషయాలను వెల్లడించారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా ఈమె రాపిడ్ ఫెయిర్ లో అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

ఈ సందర్భంగా యాంకర్ ప్రశ్నిస్తూ మీకు వెండితెర బుల్లితెర ఏది ఇష్టం అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ చాలా చక్కగా సమాధానం చెప్పారు. ఒకటి నాకు పుట్టినిల్లు మరొకటి మెట్టినిల్లు రెండిటిలో ఏది ఎక్కువ ఏది తక్కువ అని నేను చెప్పను ఈ రెండు కూడా నాకు రెండు కళ్ళు లాంటివి అంటూ ఈమె సమాధానం చెప్పారు. ఇక ఈమె బికినీలో కూడా సందడి చేసిన సంగతి తెలిసిందే ఈ విషయం గురించి ప్రశ్నిస్తూ..

చీర కట్టుకోవడం ఇష్టం లేక బికినీలో ఉండడం ఇష్టమా అంటూ కూడా ప్రశ్న వేయడంతో నేను బీచ్ కి వెళ్ళినప్పుడు చీర కట్టుకొని తిరగలేను అలాగే బయట ఈవెంట్లకు వెళ్ళినప్పుడు బికినీలో వెళ్ళలేను అందుకే ఎక్కడ వేసుకోవాల్సిన దుస్తులు అక్కడే వేసుకుంటాను అంటూ సమాధానం చెప్పేశారు. ఈమె పెద్ద ఎత్తున జిమ్ లో వర్కౌట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మీకు ఫుడ్ తినడం బాగా ఇష్టమా లేక ఎక్కువ సేపు జిమ్ లో వర్కౌట్స్ చేయడం ఇష్టమా అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు అనసూయ (Anasuya) స్పందిస్తూ తాను జిమ్ కి వెళ్లే ముందు తప్పనిసరిగా కాస్త ఏదైనా తినే వెళ్తానని తెలిపారు. ఇక నాకు ఫుడ్ అంటేనే చాలా ఇష్టం ప్రతి ఒక్కరూ కూడా బ్రతకడానికే తింటూ ఉంటారు కానీ నేను అలా కాదు తిండి కోసమే బ్రతుకుతున్నాను ఫుడ్ లేకపోతే నేను ఉండలేను అంటూ ఈ సందర్భంగా తనకు ఫుడ్ అంటే ఎంత ఇష్టమో తెలియజేశారు. అనసూయ తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేయడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus