“చావు క‌బురు చ‌ల్ల‌గా ” చిత్రంలో అన‌సూయ స్పెష‌ల్ ఐట‌మ్ సాంగ్!

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలు అందుకుంటూ సక్సెస్ కు మారుపేరుగా నిలిచిన ‌బన్నీ వాసు నిర్మాత‌గా ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’. ‌ఇప్పటికే విడుదలైన టైటిల్.. హీరో కార్తికేయ ‘బ‌స్తి బాల‌రాజు’ ఫ‌స్ట్ లుక్, ఇంట్రో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఆ త‌రువాత విడుద‌లైన క్యారెక్ట‌ర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి, టీజ‌ర్ గ్లిమ్ప్స్ కి, మైనేమ్ ఈజ్ రాజు అనే పాట‌కు కూడా అనూహ్య స్పంద‌న ల‌భించింది. ముఖ్యంగా కార్తికేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రి మాడ్యూలేష‌న్ చూస్తే మ‌ళ్లీ చూడాల‌నిపించేలా ఉందంటూ కామెంట్స్ వ‌స్తున్నాయి. అలానే ఈ సినిమాలో అనసూయ ఓ మాస్ మ‌సాలా ఐట‌మ్ సాంగ్ లో చిందేశారు.

అవుట్ అండ్ అవుట్ మాస్ బీట్స్ తో సాగే ఈ పాట‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తామ‌ని చిత్ర బృందం తెలిపింది. చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రాన్ని మార్చి 19న భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత బ‌న్నీ వాసు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పాట‌ల‌ను ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వారు విడుద‌ల చేస్తున్నారు.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus