Anasuya: పెళ్లికూతురుగా అనసూయ ఎంత అందంగా ఉందో చూసారా?

యాంకర్ అనసూయ పరిచయం అవసరం లేని పేరు ఒకప్పుడు యాంకర్ గా ఎంతో సక్సెస్ అయినటువంటి ఈమె ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా సినిమాల పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే పలు సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ అనసూయ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారని చెప్పాలి.ఇలా సినిమాలలో నటిస్తూ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇక తనకు ఏమాత్రం షూటింగ్ సమయంలో విరామం దొరికిన తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం అనసూయ తన భర్తతో కలిసి బ్యాంకాక్ వెకేషన్ వెళ్లినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఈ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి.అయితే నేడు అనసూయ సుశాంక్ పెళ్లి రోజు కావడంతో ఈమె సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి ఫోటోలను షేర్ చేశారు.

అనసూయ ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా తన పెళ్లి ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి నవవధువుగా పెళ్లి దుస్తులను అనసూయ చూడటానికి చాలా ముచ్చటగా అందంగా ఉన్నారంటూ ఈ ఫోటోల పై నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.ఇక అనసూయ పెళ్లిరోజు అని తెలియడంతో అభిమానులు కూడా ఈమెకు పెళ్లిరోజు శుభాకాంక్షలు అంటూ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక అనసూయ శశాంక్ ప్రేమ వ్యవహారం పెళ్లి గురించి అందరికీ తెలిసిందే.

అనసూయ (Anasuya) సుశాంక్ ఇద్దరి మధ్య ప్రేమ స్కూల్ సమయంలోనే మొదలైందని తెలుస్తోంది. వీరిద్దరికి ఎన్ సీ సీ క్యాంపులో పరిచయం ఏర్పడటం ఆ పరిచయం ప్రేమగా మారడం జరిగింది. ఇలా ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరి పెళ్లికి అనసూయ తండ్రి ఒప్పుకోకపోవడంతో పెద్దలను ఎదిరించి ఇంటి నుంచి బయటకు వచ్చిన అనసూయ తన పెద్దలను ఒపించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొని దాదాపు 5 సంవత్సరాల పాటు తన తండ్రి నిర్ణయం కోసం ఎదురుచూసి చివరికి ఎంతో ఘనంగా వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus