అత్త పాత్రకు ఒకే కానీ.. తల్లి క్యారెక్టర్ కష్టమంటోంది

“రంగస్థలం” చిత్రంలో రంగమ్మత్తగా అనసూయ నటవిశ్వరూపం ఆమెకు చెప్పలేనంత ఫేము, ఊహించలేనన్ని ఆఫర్లు తెచ్చిపెట్టాయి. ఆ సినిమా తర్వాత హీరోయిన్ గా ఆఫర్లు వచ్చినా అవి పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. అందుకే క్యారెక్టర్ రోల్స్ కే పరిమితం అయిపోయింది. అయితే.. ఈ క్యారెక్టర్ రోల్స్ లో కూడా తనకు ఒక లిమిట్ ఉందని.. వచ్చిన ఆఫర్లన్నీ యాక్సెప్ట్ చేయలేనని ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంది. అయినప్పటికీ ఆమెకు ఆఫర్లు క్యూ కడుతూనే ఉన్నాయి.

రీసెంట్ గా ఆమెకు సుమంత్ అశ్విన్ కు తల్లిగా నటించే ఆఫర్ వచ్చింది. ముందుగా ఆ పాత్రకు ఇంద్రజను అనుకున్నప్పటికీ.. అనసూయ అయితే గ్లామర్ కలిసొస్తుందనుకొని ఆమెను సంప్రదించారు. భారీ స్థాయి రెమ్యూనరేషన్, తక్కువ డేట్స్ అయినప్పటికీ.. తల్లి పాత్ర కావడంతో సినిమాను రిజెక్ట్ చేసింది అనసూయ. అత్త, వదిన పాత్రల వరకైతే ఒకే కానీ.. ఇలా అమ్మ పాత్రలు చేయడమంటే మాత్రం తనవల్ల కాదని తేల్చి చెప్పేసింది.

ప్రస్తుతం ఆమె కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రంగమార్తాండ”లో కీలకపాత్ర పోషిస్తోంది. అలాగే.. మరికొన్ని టాక్ షోలు ప్లాన్ చేస్తోంది అనసూయ. ఈ కరోనా కాలంలో షూటింగులకు దూరంగా ఉండడం సమంజసమని భావించి ప్రస్తుతానికి కొత్త ప్రోగ్రామ్స్ మాత్రం యాక్సెప్ట్ చేయడం లేదు. అలాగే జబర్దస్త్ షూటింగుల విషయంలో కూడా భారీ స్థాయిలో జాగ్రత్తలు తీసుకొంటోంది.

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus