Anasuya: గొడవ గురించి మాట్లాడటానికి ఇది సమయం కాదు: అనసూయ

తెలుగు చిత్ర పరిశ్రమలో యాంకర్ గా గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. అయితే యాంకర్ గా గుర్తింపు పొందినటువంటి ఈమె ప్రస్తుతం సినిమా అవకాశాలను అందుకొని వెండితెరపై వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన పెద్దకాపు సినిమా విడుదలకు సిద్ధం కాబోతుంది. ఇలా ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అనసూయ పాల్గొని సందడి చేశారు. ఇక ఈ సమావేశంలో మీడియా ప్రతినిధులు అనసూయను వివిధ రకాల ప్రశ్నలు వేశారు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండతో తనకు ఉన్నటువంటి గొడవ గురించి కూడా ప్రశ్నలు వేశారు. ఇలా విజయ్ దేవరకొండ గొడవ గురించి ప్రశ్నలు వేయడంతో అనసూయ కూడా షాకింగ్ సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ ఇది శ్రీకాంత్ అడ్డాల గారి సినిమా ఈయన సినిమాలన్నీ కూడా గొడవలకు చాలా దూరంగా ఉంటాయి.

అలాగే రేలంగి మాదిరి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి దర్శకత్వం వహించిన సినిమాలో నటించిన నేను ఈ సినిమా వేడుకలో ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పను వేరే సినిమా వేడుకలలో అయితే తప్పకుండా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేదాన్ని ఇప్పుడు మాత్రం ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే సమయం కాదు అంటూ సమాధానం చెప్పారు.

ప్రస్తుతం ఈ ప్రశ్న మీరు నన్ను అడిగి నన్ను ఇబ్బంది పెట్టకండి వేరే సినిమా ప్రమోషన్లలో అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం చెబుతాను అంటూ ఈ సందర్భంగా అనసూయ విజయ్ దేవరకొండతో గొడవ గురించి స్పందిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వీరిద్దరి మధ్య అర్జున్ రెడ్డి సినిమా సమయం నుంచి ఈ గొడవ జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus