Anasuya: ‘విమానం’ లో అనసూయ సన్నివేశాలు డిలీట్ చేయడానికి కారణం అదేనా?

రెండు రోజుల క్రితం విమానం సినిమా రిలీజ్ అయ్యింది. సముద్రఖని ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నప్పటికీ.. సెకండ్ హాఫ్ లో ఓవర్ ఎమోషన్ పెట్టేసి బాగా డ్రాగ్ చేయడం వల్ల.. టీజర్, ట్రైలర్లు చూసిన రేంజ్లో ఈ సినిమా లేదని ప్రేక్షకులు పెదవి విరిచారు. అంగ వైకల్యం కలిగిన ఓ తండ్రి తన కొడుకుని విమానం ఎక్కించడానికి పడే కష్టాలను ‘విమానం’ సినిమాలో చూపించారు.

సముద్రఖని కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ కూడా బాగా నటించాడు. శివ ప్ర‌సాద్ యానాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘జీ స్టూడియోస్‌’ సంస్థతో కలిసి ‘గని’ దర్శకుడు కిర‌ణ్ కొర్ర‌పాటి నిర్మించారు. ఈ సినిమాలో సుమతి అనే వేశ్య పాత్రలో అనసూయ నటించింది. ఓ పక్క గ్లామర్ షో చేస్తూనే మరోపక్క ఇంటిమేట్ సన్నివేశాల్లో కూడా అంటించింది. కానీ అవి హద్దులు దాటి అయితే లేవు. అయితే ‘విమానం’ లో (Anasuya) అనసూయ పాత్రకి ఇంటిమేట్ సన్నివేశాలు గట్టిగానే ఉన్నాయట.

కానీ మొదట ఆమె ఒప్పుకోలేదు అని మార్పులు చేసి తగ్గించారు. అయినప్పటికీ అనసూయ ఎక్కువ ఇంటిమేట్ సన్నివేశాల్లోనే కనపడిందట. అవి కూడా డిలీట్ చేసేయాలని ఆమె కోరగా.. ఇంతకు మించి డిలీట్ చేస్తే బాగోదు అని టీం చెప్పిందట. అయినా ఆమె రచ్చ చేసేసరికి దర్శకనిర్మాతలకు వేరే ఆప్షన్ లేక డిలీట్ చేశారు.

అందుకే ఈ సినిమాలో ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది అని టీం భావిస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ఒక్క సీన్లో తప్ప అనసూయ పాత్రకి.. ఈ సినిమా కథకి అస్సలు సంబంధం లేదు. అడిగినంత పారితోషికం ఇచ్చినా సరే అనసూయ ‘విమానం’ టీంకి ఉపయోగపడలేదు అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus