‘చావు కబురు చల్లగా’లో హాట్ యాంకర్!

  • January 29, 2021 / 01:18 PM IST

హాట్ యాంకర్ అనసూయ బుల్లితెరపై ఎంత పాపులారిటీ దక్కించుకుందో తెలిసిందే. అలానే వెండితెరపై కూడా తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ‘క్షణం’, ‘రంగస్థలం’ వంటి సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. వైవిధ్యమైన పాత్రలను ఎన్నుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. గతంలో ‘విన్నర్’ సినిమాలో ఐటెం సాంగ్ లో నటించిన అనసూయ ఇప్పుడు మరోసారి స్పెషల్ సాంగ్ కోసం రెడీ అవుతోందని సమాచారం. కార్తికేయ-లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తోన్న ‘చావు కబురు చల్లగా’ సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ లో నటిస్తోందట.

కౌశిక్ పెగల్లపాటి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాని గీతాఆర్ట్స్ 2 బ్యానర్ నిర్మిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ని మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాకి అదనపు ఆకర్షణలు జోడించాలని భావించిన మేకర్లు అనసూయని సంప్రదించినట్లు తెలుస్తోంది. వైవిధ్యమైన పాత్రలనే ఎన్నుకుంటూ నటిస్తోన్న అనసూయ ఇప్పుడు ఐటెం సాంగ్ లో నటించడానికి అంగీకరించడం విశేషం. దీనికోసం ఈమెకి భారీ మొత్తాన్నే ముట్టజెప్పుతున్నారట.

త్వరలోనే ఈ పాట చిత్రీకరణ మొదలుపెట్టనున్నారు. ప్రస్తుతం అనసూయ నటించిన ‘థాంక్యూ బ్రదర్’ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. అలానే ఈ ఏడాది తమిళంలో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus