Anasuya: నెటిజన్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన అనసూయ..!

బుల్లితెరకి గ్లామర్ ను పరిచయం చేసిన యాంకర్లలో అనసూయ భరద్వాజ్ కూడా ఒకరు. ‘జబర్దస్త్’ కామెడీ షోతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈమె సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఈమె చేతిలో చాలా సినిమా అవకాశాలు ఉన్నాయి. ఇక బుల్లితెర పై షోలతో అలాగే ప్రీ రిలీజ్‌ ఈవెంట్స్ వంటి వాటితో బిజీగానే గడుపుతుంది.ఇక సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలను షేర్ చేయడానికి కూడా కొంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటుంది ఈ అమ్మడు.ఇద్దరు పిల్లలకి తల్లైనా కూడా వన్నె తగ్గని అందం ఈమె సొంతం.

Click Here To Watch NOW

ఇదంతా ఒక ఎత్తు అయితే వివాదాలతో కూడా ఈమె నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది.సోషల్ మీడియాలో అనసూయ డ్రెస్సింగ్ స్టైల్ పై చాలా విమర్శలు వెల్లువెత్తుతూ ఉంటాయి.ఈ క్రమంలో అనసూయకి కొంత మంది మద్దతుగా నిలిచేవారు కూడా లేకపోలేదు. అనసూయని ఉద్దేశించి ఎవరైనా నెగిటివ్ పోస్ట్ లు పెడితే వాళ్ళకి దిమ్మ తిరిగే కౌంటర్లు ఇస్తుంటుంది ఈ అమ్మడు. తాజాగా ఇలాంటి సన్నివేశం మరోసారి రిపీట్ అయ్యింది. విషయంలోకి వెళ్తే ఓ నెటిజెన్..

‘ ‘అనసూయ గారు మీరు ఇద్దరు పిల్లల తల్లి. ఇంకా పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటావా.. తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నావు’ అంటూ అనసూయను ట్యాగ్‌ చేసి ఓ పోస్ట్ పెట్టాడు.వీటికి అనసూయ బదులిస్తూ.. ‘దయచేసి మీరు మీ పని చూసుకోండి.. నన్ను నా పని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

ప్రస్తుతం అనసూయ ‘దర్జా’, ‘ఆచార్య’, ‘గాడ్‌ ఫాదర్‌’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ‘పుష్ప2’ ప్రాజెక్టులో కూడా ఈమె మరింత పవర్ ఫుల్ గా కనిపించనుంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus