Anasuya: నెటిజన్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన అనసూయ..!

ఈ ఏడాది “జీ తెలుగు కుటుుంబం అవార్డ్స్” చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. సినీ, బుల్లితెర సెలబ్రెటీలతో షోలో సందడి మాములుగా లేదు. ఆర్జీవీ, జయప్రద, నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ అనిల్ రావిపూడి, రేణు దేశాయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ సహా పలువురు వెండితెర సెలబ్రెటీలతో షో అద్భుతంగా జరిగింది. ఇక ఇందుకు సంబంధించిన ప్రోమో ఆకట్టుకుంటుంది. ఇక ఈ వేడుకలో అలనాటి తారలు సావిత్రి, జమున, శ్రీదేవి, సౌందర్య నటించిన కొన్ని పాటలను అనసూయ రీ క్రియేట్‌ చేసింది.

సంబంధిత సాంగ్స్‌లో వారు ఎలాంటి వేషధారణతో కనిపించారో అలాంటి దుస్తులే అనసూయ ధరించి వారిని మరిపించేలా ప్రదర్శన ఇచ్చింది. ఆ కార్యక్రమం టీవీలో ప్రసారమయ్యే కొన్ని గంటల ముందు కొన్ని ఫొటోలను ఆమె సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘నా పెర్ఫామెన్స్‌తో లెజండరీ తారలకు నివాళి ఇచ్చే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా’ అని పేర్కొంది.

‘సావిత్రి లుక్‌ మీకు బాగా సెట్‌ అయింది’, ‘అన్ని గెటప్పుల్లో బాగున్నారు’, ‘అదుర్స్‌’ అంటూ అభిమానులు ప్రశంసించగా ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. అతడికి అనసూయ రిప్లై ఇచ్చింది. ‘ఎక్స్‌పోజ్‌ చేసినంత తేలిక కాదు సావిత్రిలా నటించడమంటే’ అని కామెంట్‌ చేయగా దానిపై అనసూయ స్పందిస్తూ.. ‘కరెక్ట్‌గా చెప్పారండీ.. సావిత్రి అమ్మలా యాక్ట్‌ చేయడం ఎవరి తరంకాదు. నేను ట్రిబ్యూట్‌ ఇచ్చానంతే. అలాగే ఎక్స్‌పోజింగ్‌ చేయడం కూడా తేలిక కాదు.

శారీరకంగా మానసికంగా చాలా ప్రిపేర్‌ అవ్వాలి. ఏ పాత్ర చేసినా, ఏ దుస్తులు ధరించినా మన పనిని దృఢ సంకల్పంతో చేయాలి’ అని సమాధానమిచ్చింది. ‘విమానం’, ‘పెదకాపు 1’, ‘ప్రేమ విమానం’ తదితర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన (Anasuya) అనసూయ ‘పుష్ప 2’తోపాటు మరికొన్ని సినిమాల్లో కీలక పాత్రలు చేస్తుంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus