Anasuya Bharadwaj: తమ్ముడు అంటూనే తాట తీసిన అనసూయ.. అసలేం జరిగిందంటే..

సామాజిక మాధ్యమాలు వచ్చాక సెలబ్రిటీలకు, సామాన్యులకు దూరం తగ్గిపోయింది.. తెరమీద మాత్రమే చూసి మురిసిపోయే స్టార్లను ఫాలో అవుతూ.. వారి ఫోటోలు, వీడియోలకు లైక్స్, కామెంట్స్ చేస్తూ.. ఒక్కోసారి లైవ్ చిట్ చాట్‌లో ముచ్చటిస్తూ సంబర పడిపోతుంటారు ఫ్యాన్స్.. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ కొందరు ఆకతాయిలు మాత్రం నోటికొచ్చినట్టు ముందూ వెనుకా తెలియకుండా మాట్లాడుతూ చికాకు తెప్పిస్తుంటారు.. అలాగే అసభ్యకరమైన కామెంట్స్ చేసిన ఓ వ్యక్తికి చెప్పులతో చెంపలేస్తానంటూ వార్నింగ్ ఇచ్చింది యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్..

వాలంటైన్స్ డే సందర్భంగా అనసూయ తన భర్త శశాంక్ భరద్వాజ్‌తో కలిసున్న పిక్ షేర్ చేస్తూ.. ‘‘నీతో లైఫ్ అంటే క్రేజీయెస్ట్ రోలర్ కోస్టర్ రైడ్‌లా ఉంటుంది’’ అని కొటేషన్ ఇచ్చింది.. దీనిపై ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ.. ‘‘అలా ఏం లేదు అక్కా.. వాడి దగ్గర డబ్బుంది.. అందుకే’’ అని కామెంట్ చేశాడు.. దీంతో అనసూయకి పిచ్చ కోపమొచ్చింది.. వాలంటైన్స్ డే నాడు తన భర్త గురించి కామెంట్ చేసే సరికి శివంగిలా ఫైర్ అయిపోయింది..

‘‘అదేంట్రా తమ్ముడూ అలా అనేశావ్. ఎంతుందేంటి మనీ?.. నాకు లేదా మనీ మరి?. చెప్పు.. నీకన్నీ తెలుసు కదా.. అయినా ఆయన డబ్బు, నా డబ్బు అనేది కూడా ఉందా? రేయ్ చెప్పరా బాబూ.. అయినా బావ గారిని వాడు, వీడు అనొచ్చా? ఇదేం పెంపకంరా నీది.. చెంపలేసుకో. లేకపోతే నేను వేస్తా చెప్పులతో.. నేను అంది చెంపలేస్తా” అంటూ షాకింగ్ రిప్లై ఇచ్చింది.. అయినప్పటికీ ఆ నెటిజెన్ కూడా అక్కడితో సైలెంట్ అవకుండా…

“మీరు రియాలిటీని అర్థం చేసుకోవాలి.. మీరు ఎన్ని చెప్పినా రియాలిటీ రియాలిటీనే..” అని కామెంట్ చేశాడు. దీనిపై కూడా అనసూయ తన స్టైల్లో మరోసారి రిప్లై ఇచ్చింది.. ‘‘నీ బొందరా నీ బొంద.. ముందు మాట్లాడటం నేర్చుకో.. అంతర్యామిలా అన్నీ తెలిసినట్లు బిల్డప్ ఒకటి.. నా రియాలిటీ నీకేం తెలుసురా.. పచ్చ కామెర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంట. నీ బుద్ధి మనీ ఒకటే కాబట్టి.. అందరిదీ అదే అనిపిస్తుంది..

వీలైతే నీ బుద్ధి మార్చుకో.. గెట్ వెల్ సూన్.. తమ్ముడివి కదా మంచీ, చెడూ చెప్తున్నా.. ఏమనుకోకయ్యా’’ అని స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చింది.. ఆ తర్వాత మరో నెటిజెన్ కూడా నెగిటివ్ కామెంట్ పెట్టడంతో.. ‘‘నా ఇన్ స్టాగ్రామ్‌లో నేను ఫోటో పెట్టుకుంటే నీకేం ప్రాబ్లెమ్ రా?.. అయినా నచ్చకపోతే ఫాలో అవ్వడం ఎందుకు? దొబ్బెయ్’’ అని రిప్లై ఇచ్చింది.. దీంతో ఈ వ్యవహారం కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది..

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus