అలీ మాటలకు వెక్కి వెక్కి ఏడ్చేసిన అనసూయ..!

ఈటీవిలో ప్రసారం అయ్యే అలీతో సరదాగా టాక్ షోకి మంచి ఆదరణ ఉంది. నాటి నేటి తరం తారలతో అలీ హోస్ట్ గా సాగే ఈ షో సరదాలు, ఎమోషన్స్ సమాహారంగా సాగుతుంది. అలీ మార్క్ పంచులు కూడా ఈ షోకి ప్రధాన ఆకర్షణ. ఇక ఈనెల 24న ప్రసారం కాబోయే షోలో అతిథిగా యాంకర్ అనసూయ పాల్గొన్నారు. సరదాగా మొదలైన ఈ టాక్ షోని అనసూయ ఎమోషనల్ గా ముగించినట్లు ప్రోమో చూస్తే తెలుస్తుంది. అలీ తో సరదాగా తాజా ప్రోమోలో అనసూయ కన్నీటి పర్యన్తరం అయ్యారు.

దానికి కారణం అలీ అనసూయ గారి తల్లి గురించి అడగడమే. తన చిన్న వయసులో కుటుంబాన్ని పోషించడం కోసం తన తల్లిపడిన కష్టాన్ని ఆమె తలుచుకొని కన్నీరు పెట్టుకున్నారు. అనసూయ చిన్నతనంలో వారి కుటుంబం ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొందట. పిల్లలను చదివించడానికి వాళ్ళ అమ్మ అనేక రకాల పనులు చేయాల్సి వచ్చిందట. ఇంటి అవసరాల తీరేవి కావట, చివరికి ఇంటి అద్దె కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు కూడా చూశారట.

ఇక మెట్రో బస్సు, ఆర్డినరీ బస్సు ఛార్జిలో అర్థ రూపాయి వ్యత్యాసం ఉండగా, ఆ అర్థ రూపాయి మిగల్చడం కోసం అనసూయ రెండు బస్ స్టాప్స్ వరకు నడిచి వెళ్లేవారట. ఇలాంటి విషయాలను తలుచుకొని అనసూయ షోలో కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తూ కార్లతో తిరుగుతున్న అనసూయ పరిస్థితి అప్పుడు అంత దుర్భరంగా గడించిందా అని అనిపిస్తుంది.


మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus