Anasuya, Allu Arjun: ఆ కారణంతో అల్లు అర్జున్ సినిమాని రిజెక్ట్ చేసిన అనసూయ?

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు పొంది ప్రస్తుతం వెండితెర నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వెండి తెరపై వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ తనకు అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చినప్పటికీ తాను రిజెక్ట్ చేశాను అంటూ షాకింగ్ విషయాలను బయట పెట్టారు. మరి అల్లు అర్జున్ నటించిన ఏ సినిమాలో ఈమెకు హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది ఎందుకు ఈ సినిమాని రిజెక్ట్ చేశారు అనే విషయాన్ని వస్తే.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య సినిమాకు సీక్వెల్ చిత్రంగా ఆర్య 2 ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ శ్రద్ధ దాస్ నటించారు. అయితే ఈ సినిమాలో ఈమెకు సుకుమార్ గారు హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చారట అయితే ఏ పాత్రలో అనే విషయం మాత్రం చెప్పలేదు. కానీ తనకు ఈ అవకాశం ఇచ్చిన వెంటనే ఈమె మరో మాట మాట్లాడకుండా తాను ఈ సినిమాలో నటించనని రిజెక్ట్ చేశారట. సినిమాలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కనుక సెకండ్ హీరోయిన్ శ్రద్ధాదాస్ పాత్రలో బహుశా ఈమెను సంప్రదించి ఉంటారని తెలుస్తోంది.

Anasuya out from Allu Arjun movie1

ఇక అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ వస్తే నటించడానికి ఎంతో మంది ఎదురుచూస్తున్నారు అలాంటిది అనసూయ ఎందుకు రిజెక్ట్ చేసిందనే విషయానికి వస్తే అప్పటికే ఈమె తన భర్త శశాంక్ భరద్వాజ్ తో నిశ్చితార్థం జరిగి పెళ్లి కూడా దగ్గర్లో ఉన్న నేపథ్యంలోనే ఈమె ఈ సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకున్నారని తెలుస్తోంది. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్నారు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈయనతో పుష్ప సినిమాలో అనసూయ (Anasuya) స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus