Anasuya: జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన యంకర్ అనసూయ..!

యాంకర్ అనసూయ జబర్దస్త్ షో ప్రారంభమైనప్పటి నుంచి బుల్లితెరపై తన హవాను కొనసాగిస్తున్నారు. జబర్దస్త్ షోకు ముందు అనసూయ కొన్ని సినిమాలలో నటించినా ఆ సినిమాలు అనసూయకు పెద్దగా గుర్తింపును తెచ్చిపెట్టలేదు. జబర్దస్త్ షో తర్వాత మాత్రం ఆ షో వల్ల వచ్చిన గుర్తింపుతో అనసూయ వెండితెరపై కూడా ఆఫర్లు అందిపుచ్చుకోవడంతో పాటు విజయాలను సొంతం చేసుకుంటున్నారు. అయితే తాజాగా అనసూయకు జబర్దస్త్ షోలో అవమానం జరిగింది. అనసూయ పెళ్లై పిల్లలున్నా బుల్లితెర షోలలో, సోషల్ మీడియాలో గ్లామరస్ గా కనిపిస్తారనే సంగతి తెలిసిందే.

కొన్నిసార్లు అనసూయ డ్రెస్సులపై నెటిజన్లు ట్రోల్ చేయడం ట్రోల్ చేసిన వాళ్లకు అనసూయ కౌంటర్లు ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా రిలీజైన జబర్దస్త్ షో ప్రోమోలో మాత్రం అనసూయకు ఘోర అవమానం జరగడం గమనార్హం. యూట్యూబ్ వీడియోల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న యాంకర్ శివ జబర్దస్త్ షోకు గెస్ట్ గా హాజరు కాగా శివ అనసూయ గారిని ఒక చిన్న ప్రశ్న అడగాలని అనుకుంటున్నానని చెబుతారు.

ఎందుకు అనసూయ గారు చిన్నచిన్న బట్టలు వేసుకుంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారని శివ ప్రశ్నించగా వాళ్లకు ఇండస్ట్రీ గురించి తెలీదు కాబట్టి అలా కామెంట్లు చేసి ఉండవచ్చని మీరు ఇండస్ట్రీకి చెందిన వారై ఉండి కూడా అలా అడగటం ఏమిటని అనసూయ ప్రశ్నిస్తారు. అది తన వ్యక్తిగత విషయమని అనసూయ చెప్పుకొస్తారు. మీ పర్సనల్ అయితే ఇంట్లో చూసుకోవచ్చు కదా ఇక్కడ ఎందుకు అని శివ ప్రశనించగా వాట్ ఈజ్ దిస్..? మీకు తెలీకుండానే ఇవి జరుగుతున్నాయా..? అని అనసూయ షో నుంచి వెళ్లిపోయారు. అయితే నిజంగా ప్రోమో కోసం ఇలా చేశారా..? లేక నిజంగానే షోలో గొడవ జరిగిందా..? తెలియాలంటే వచ్చే గురువారం వరకు ఆగాల్సిందే.


బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus