Anchor Jhansi: యాంకర్ ఝాన్సీ మేనేజర్ మృతి.. ఎమోషనల్ అయిన యాంకర్!

సినిమా సెలబ్రిటీలు ఎక్కువగా వారి మేనేజర్లపైనే ఆధారపడుతూ ఉంటారని సంగతి మనకు తెలిసిందే. వారి కాల్ షీట్స్ చూసుకోవడం నుంచి మొదలుకొని వారి రెమ్యూనరేషన్ విషయాలు అన్నింటి వరకు కూడా మేనేజర్ల పైనే ఆధారపడి ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి వారిని తమ మేనేజర్లుగా నియమించుకుంటూ ఉంటారు ఈ క్రమంలోనే యాంకర్ ఝాన్సీ సైతం శ్రీను అనే వ్యక్తిని తన మేనేజర్ గా నియమించుకున్నారు అయితే తాజాగా ఆయన గుండెపోటుతో మరణించారు.

ఈ విధంగా తన మేనేజర్ మరణించడంతో యాంకర్ ఝాన్సీ ఎంతో ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. ఈ సందర్భంగా ఈమె స్పందిస్తూ శ్రీనుని నేను చాలా ముద్దుగా శీను బాబు అని పిలుచుకుంటాను. తను నాకు మేనేజర్ మాత్రమే కాదు నా సొంత తమ్ముడు లాగా భావిస్తాను ఆయనే నా సపోర్ట్ సిస్టం నా బలం. నాకు సంబంధించిన అన్ని విషయాలను ఎంతో సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఉంటారు.

శీను నా బిగ్ రిలీఫ్ ఎంతో మంచివాడు సహృదయుడు అందరినీ ఎప్పుడూ నవ్విస్తూ ఉంటారు. హెయిర్ స్టైలిస్ట్ గా నాకు పరిచయమైనటువంటి శీను నా మేనేజర్ గా కొనసాగుతూ వచ్చారు అయితే ఉన్నఫలంగా ఆయన గుండెపోటుతో మరణించడం ఎంతో బాధాకరం 35 సంవత్సరాలకే గుండెపోటు అనే విషయం తెలిసి మాటలు రావడం లేదు. ఈ వార్త నన్ను ఎంతగానో కలిచి వేస్తుంది. జీవితం అనేది ఒక నీటి బుడగ లాంటిది అంటూ ఈ సందర్భంగా ఈమె ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఈ విధంగా ఝాన్సీ ( Jhansi) మేనేజర్ మరణించడంతో ఈమె తన గురించి ఎంతో గొప్పగా చెప్పడమే కాకుండా తన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఈ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారడంతో పలువురు నెటిజెన్స్ ఈ పోస్ట్ పై స్పందిస్తూ విచారం వ్యక్తం చేస్తున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus