స్టార్ హీరో అవ్వాలనుకొంటున్న స్టార్ యాంకర్.!

డైరెక్టర్లుగా, అసిస్టెంట్ డైరెక్టర్లుగా, ఆర్ట్ డైరెక్టర్లుగా ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న సగానికిపైగా జనాలు ఇండస్ట్రీకి వచ్చింది నటులుగా రాణిద్దామనే ఆశయంతోనే. అయితే.. పరిస్థితులు సహకరించక దొరికిన/కుదిరిన పొజిషన్ లో సెటిల్ అయిపోతారు. అలా హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చి అది కుదరక యాంకర్ గా మారిన వ్యక్తి ప్రదీప్ మాచిరాజు (Anchor Pradeep Machiraju). అందరిలాగే చిన్న యాంకర్ లా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు స్టార్ యాంకర్ గా ఎదిగాడు. ఏకంగా ఒక టాక్ షోను స్వయంగా హోస్ట్ చేసే స్థాయికి ఎదిగాడు.

మధ్యమధ్యలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ ప్లే చేశాడు. “గురువారం మార్చి ఒకటి” అనే సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుదామనుకొన్నప్పటికీ.. ఆ సినిమా సగం షూటింగ్ పూర్తి చేసుకొన్నాక ఆగిపోయింది. దాంతో ప్రదీప్ వెండితెర ఎంట్రీ ఆగిపోయింది అనుకొన్నారందరూ. కొంత విరామం అనంతరం ప్రదీప్ మళ్ళీ హీరోగా ప్రయత్నిస్తున్నాడు. సుకుమార్ అసోసియేట్ ఒకతను ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడట. ప్రస్తుతం క్యాస్ట్ & క్రూ ఎంపిక జరుగుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus