‘జబర్దస్త్’ కామెడీ షో హాట్ యాంకర్స్ లో అనసూయతో పాటు రష్మీ కూడా ఒకరు. యాంకర్ గా రాణిస్తూనే సినిమాల్లో కూడా నటిస్తూ వస్తుంది. ‘గుంటూర్ టాకీస్’ ‘అంతం’ వంటి బోల్డ్ సినిమాలు చేసింది. ఆ సినిమాల్లో ఆమె చేసిన గ్లామర్ షో కుర్ర కారుకి నిద్ర లేకుండా చేసాయి. ఇక సోషల్ మీడియాలో కూడా ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేయడంతో పాటు… అభిమానులు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇస్తూ వారికి టచ్ లో ఉంటుంది. ఈ క్రమంలో ఎవరైనా తనని ఒళ్ళు మండించే ప్రశ్నలడిగితే.. వారికి ఎడా పెడా క్లాస్ పీకుతుంటుంది. తాజాగా మరోసారి తన పై కామెంట్స్ చేసిన నెటిజన్ కి చుక్కలు చూపించింది.
తాజాగా తాను లైవ్ వీడియోలో పాల్గొని అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలో ఆమెని కొందరు అసభ్యకరమైన ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలో వారి పై మండిపడింది రష్మీ. “కొందరు పిచ్చి రాతలు రాస్తూ నాకు అసభ్యకర మెసేజ్ లు పెడుతున్నారు. అయితే నేను మెచ్యూర్డ్ గా ఆలోచిస్తాను కాబట్టి అలాంటి విషయాలు పట్టించుకోను. ఆ మెసేజ్ లు నా పై పెద్దగా ప్రభావం కూడా చూపవు. అలా మెసేజ్ లు పెట్టే వారి గురించి పట్టించుకోకపోయినా.. ఆ మెసేజ్ లు సమాజంలో ఎక్కిస్తున్నారు. అలాంటి పిచ్చికుక్కల వల్లే ప్రస్తుతం అమ్మాయిలు బాహాటంగా మాట్లాడలేకపోతున్నారు. నేను పబ్లిక్ ఫిగర్ ని కాబట్టి.. నాకు ఇలాంటి మెసేజ్ లు వస్తున్నాయని అనుకోవడం పొరపాటు. రెగ్యులర్ గా ఉద్యోగాలు చేస్తున్న ఎందరో అమ్మాయిల పై ఇలాంటి దాడి జరుగుతుంది. ‘రాత్రికి ఎంతిస్తే వస్తావ్..? ఎంత డబ్బు కావాలంటూ’ వల్గర్ గా కామెంట్లు పెడుతున్నారు. అలా అడగడానికి సిగ్గుగా లేదా..? అసలు నేను మీతో ఎందుకు పడుకుంటాను. మీరేం.. అంత ఉద్దరించారని…! నా ఒక్కదాని గురించే ఇలా మాట్లాడటం లేదు.. ఇలాంటి కామెంట్ల వల్ల బాధలు పడుతున్న అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాను” అంటూ మండిపడింది.