Rashmi: సరదా కోసం అలాంటి వీడియోలను దయచేసి షేర్ చేయొద్దు!

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతోమంది ఈ అభివృద్ధి చెందిన టెక్నాలజిని మంచి కోసం ఉపయోగించగా మరికొందరు చెడు మార్గంలో ప్రయాణం చేస్తూ ఎంతో మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ వాటిని న్యూడ్ వీడియోలు గా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నటువంటి సంఘటనలను మనం తరచూ చూస్తున్నాము. ఈ క్రమంలోనే ఇలాంటి వీడియోలపై తాజాగా యాంకర్ రష్మి స్పందించారు.

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు పొందిన (Rashmi) రష్మి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలతో పాటు ఇతర విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు. అయితే తాజాగా ఈమె తన అభిమానులను ఉద్దేశిస్తూ కొన్ని సలహాలు ఇచ్చారు. అభివృద్ధి చెందిన ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని ఎంతోమంది వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారి నుంచి అమ్మాయిలను దాక్కోమని చెప్పే బదులు ఇలాంటి వాటిపై వారికి అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యమని తెలిపారు.

ఇలా సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజం కాదని అర్థమయ్యేలా చెబుదాం… కేవలం మీ సరదా కోసం ఇలాంటి అభ్యంతరకరమైన వీడియోలను షేర్ చేయొద్దని చెబుదాం అంటూ ఈమె తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏఐ టెక్నాలజీని ఉద్దేశిస్తూ ఒక నెటిజన్ షేర్ చేసిన పోస్ట్ ను రష్మీ తన ఇన్ స్టాలో షేర్ చేశారు. ఇందులో ఏముంది అనే విషయానికి వస్తే ఈ పోస్ట్ చూసినటువంటి అమ్మాయిలందరూ కూడా సోషల్ మీడియాలో తమ ఖాతాలను ప్రైవేటు చేసుకోండి అలాగే డీపీ లో ఒకవేళ మీ ఫోటో ఉంటే వెంటనే తొలగించండి.

మీ ఫోటోలను ఎవరితో పంచుకోవద్దు ఎందుకంటే ఏ ఐ టెక్నాలజీ ఉపయోగించి కొందరి దుర్మార్గులు అభ్యంతరకరమైన వీడియోలను క్రియేట్ చేస్తున్నారనీ, దయచేసి జాగ్రత్తగా ఉండండి అంటూ ఉన్నటువంటి ఈ పోస్టును ఈమె షేర్ చేశారు.ఇక ఈ పోస్టుపై రష్మీ కూడా స్పందిస్తూ సురక్షితంగా జీవించడానికి కష్టంగా మారిందని ఈమె చెప్పడమే కాకుండా ఇలాంటి వాటిని చూసి భయపడకుండా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని చెప్పుకొచ్చారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus