Rashmi: ఆ వ్యక్తి వల్ల ప్రమాదం… కాపాడండి అంటూ రష్మీ ట్వీట్!

బుల్లితెర స్టార్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మి వాడు రేపిస్ట్ కాపాడండి అంటూ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవ్వడమే కాకుండా అందరికి ఆందోళన కలిగిస్తుంది. ఇలా రష్మీ చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి రష్మీ చేసిన ఈ పోస్ట్ ఏంటి అనే విషయానికి వస్తే… రష్మీ పెట్ లవర్ అనే విషయం మనకు తెలిసిందే.

మూగజీవాలు అంటే ఎంతో ప్రేమ చూపించే రష్మీ ఎక్కడైనా మూగజీవాలను హింసిస్తూ తన కంట పడితే మాత్రం వారిని శిక్షించాలి అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తుంటారు. అయితే ఇలా మూగజీవాళ్లకు మద్దతు తెలపడంతో కొన్నిసార్లు ఈమె విమర్శలను కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. ఇకపోతే తాజాగా ఓ వ్యక్తి చిన్న కుక్క పిల్ల పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించారు. ఇలా ఆ వ్యక్తి కుక్కపిల్ల పట్ల ప్రవర్తిస్తున్నటువంటి తీరు రష్మీ కంటపడింది దీంతో ఒక్కసారిగా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ రష్మీ దృష్టికి వచ్చింది.

దీంతో రష్మీ (Rashmi) తీవ్ర ఆందోళనకు గురైంది. ఆ కుక్క పిల్లను కాపాడాలంటూ సోషల్ మీడియా వేదికగా వేడుకుంది. ఢిల్లీ పోలీసులు, పెటా సంస్థ, ఎంపీ మేనకా సంజయ్ గాంధీలను సదరు ట్వీట్ లో ట్యాగ్ చేసింది. అతను చాలా క్రూరంగా ఉన్నారు. తన వల్ల ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ప్రమాదం కావచ్చు పిల్లలను లైంగికంగా వేధించవచ్చు, తను ఒక రేపిస్ట్ కూడా కావచ్చు అంటూ తీవ్ర పదజాలంతో ఆవేదన వ్యక్తం చేస్తూ రష్మి చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఈ పోస్ట్ పై పలువురు వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఈమెకు మద్దతు తెలుపగా మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు. మీలాంటి వారి వల్లే వీధి కుక్కలు చెలరేగిపోతున్నాయని ఏకంగా పసిపిల్లల ప్రాణాలు కూడా తీస్తున్నాయి అంటూ హైదరాబాద్ ఘటనను మరోసారి తెరపైకి తెస్తూ విమర్శలు కురిపిస్తున్నారు.

ఇలా వీధి కుక్క దాడిలో భాగంగా చిన్నారి మరణించిన సమయంలో సోషల్ మీడియా వేదికగా రష్మీ చాలా విమర్శలను ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే బుల్లితెర కార్యక్రమాలతో పాటు పలు సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus