యాంకర్ రవి ‘బిగ్ బాస్ సీజన్ 5’ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కూల్ గా గేమ్ ఆడుతున్నాడు. ఇతని జర్నీ దాదాపు అందరికీ తెలిసిందే. స్టార్ యాంకర్ గా 365 రోజులు బిజీగా ఉండే రవి పై అదే విధంగా ట్రోల్స్ కూడా ఫేస్ చేస్తుంటాడు. కానీ అతను మాత్రం వాటిని పట్టించుకోకుండా చాలా పాజిటివ్ వే లో ముందుకు సాగుతుంటాడు. మరీ ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ .. రవి యాంకరింగ్ ను బాగా ఇష్టపడుతుంటారు. ఇదిలా ఉండగా.. స్టార్ యాంకర్ గా రాణిస్తున్న రవి సినిమాల్లో ఎక్కువగా నటించింది లేదు.
హీరోగా ఓ సినిమా చేసాడు తర్వాత రవితేజ నటించిన ‘టచ్ చేసి చూడు’ లో చిన్న పాత్రని పోషించాడు. అసలు ‘నటన వైపు ఎందుకు దృష్టి పెట్టలేదు?’ అని రవినే అడిగితే.. ‘బుల్లితెర పై ప్రేక్షకులను నిరంతరం అలరించే అవకాశం లభించడం కూడా ఒక వరమే. దీనిని పక్కన పెట్టి నటన పై ఫోకస్ పెట్టాలని.. ఎప్పుడూ అనుకోలేదని’ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ‘కాల్షీట్లు అడ్జస్ట్ చేయడం కూడా పెద్ద టాస్క్’ అని అతను తెలియజేసాడు.
గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అవకాశాలు వచ్చినా.. ఎంతో మంది దర్శకులు పర్సనల్ గా అప్రోచ్ అయినా వారి సినిమాల్లో యాక్ట్ చేయలేకపోయాడట.మహేష్ బాబు 25వ సినిమా అయిన ‘మహర్షి’ లో కూడా యాంకర్ రవికి అవకాశం వచ్చిందట. ఆ సినిమాలో మహేష్ పర్సనల్ అసిస్టెంట్ గా శ్రీనివాస్ రెడ్డి నటించాడు. మొదట ఆ పాత్రకి రవినే అనుకున్నాడట దర్శకుడు వంశీ పైడిపల్లి. కానీ విలేజ్ లో షూటింగ్ అనడంతో మిస్ చేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు రవి.