శ్రీముఖి, లాస్య, వర్షిణి లతో రవి ఎఫైర్స్.. అతని భార్య ఏమందంటే?

బుల్లితెర మేల్ యాంకర్స్ లో ప్రదీప్, రవి కి మంచి క్రేజ్ ఉన్నసంగతి తెలిసిందే. వీరిలో ప్రదీప్ కు ఎలాగు పెళ్ళవ్వలేదు. ఇక రవికి పెళ్లైందా అనే డౌట్ చాలా మందికి ఉంది. ఇక రవి కూడా తన పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ బయట్టలేదు అని అందరూ కామెంట్స్ చేస్తుంటారు. అయితే కొన్ని నెలల క్రితమే తన కుటుంబాన్ని అందరికీ పరిచయం చేసాడు రవి. ‘నేను కూడా ఓ ఫ్యామిలీ పర్సన్ నే’ అంటూ తన కుటుంబాన్ని పరిచయం చేశాడు రవి. తన భార్య నిత్య సక్సేనాతో పాటు మూడేళ్ళ పాప‌ను కూడా పరిచయం చేస్తూ ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లలో పోస్ట్ చేశాడు. తాజాగా మరోసారి తన కుటుంబానికి సంబందించిన ఫోటోలను షేర్ చేశాడు.

ఓ ఛానల్ లో ప్రసారం అవుతున్న’ఔను వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు’ అనే షోలో కూడా మరోసారి రవి కుటుంబంతో పాటు ఎంట్రీ ఇచ్చాడు. ఈ షో కి కూడా తన భార్య నిత్యాతో పాటు కూతురు కూడా వచ్చింది. ఈ షో లో మాత్రం తన పర్సనల్ విషయాలు గురించి కాస్త ఎక్కువే తెలిపాడు. అంతే కాదు తన ఎఫైర్స్ గురించి వచ్చిన వార్తల పై కూడా డిస్కస్ చేసాడు రవి. గతంలో లాస్యతో, తరువాత వర్షిణి, శ్రీముఖి వంటి యాంకర్స్‌తో కూడా రవికి ఎఫైర్స్ ఉన్నాయనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే తన భార్య నిత్య కూడా రవి పై వచ్చే వార్తల గురించి మాట్లాడింది. ‘అటువంటి వార్తలు వచ్చినప్పుడు… నేను అస్సలు బాధపడను.. అలాంటి పరిస్థితుల్లో కూడా రవికి నేను అండగా ఉంటాను. తనకి కూడా ఇదే చెప్తుంటాను” అంటూ చెప్పుకొచ్చింది.

1

2

3

4

5

6

7

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus